Illegal affair: భార్య మ్యాటర్ తెలిసిపోయింది, తల నరికి చేతిలో పట్టుకుని 12 కిలోమీటర్లు వాకింగ్ చేసిన భర్త !
ఒడిశా/ దెంకనాల్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. డబ్బు సంపాధించే పనిలో భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. బయట ఎక్కువగా ఉంటున్న భర్తకు అతని భార్య మీద అనుమానం మొదలైయ్యింది. నా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తనను మోసం చేస్తోందని భర్త రగిలిపోయాడు. ఇదే విషయంలో దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చూసి రగిలిపోయాడు. సహనం కోల్పోయిన భర్త వేటకొడవలితో అతని భార్య తల పూర్తిగా నరికేసి తల, మొండెం వేరు చేశాడు. భార్య తలకు ఉన్న జుట్టు చేతిలో పట్టుకున్న భర్త 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వాకింగ్ చేస్తున్నట్లు వెళ్లడం కలకలం రేపింది. నా భార్య ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, అందుకే నరికి చంపేశానని భర్త పబ్లిక్ గా చెప్పడంతో అందరూ హడలిపోయారు.

పెద్దలు సెట్ చేసిన పెళ్లి
ఒడిశాలోని దెంకనాల్ జిల్లాలోని గాండియా సమీపంలోని చంద్రశేఖర్ పూర్ ప్రాంతంలో నకాఫోడీ మాఝీ అలియాస్ నకాఫోడీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నకాఫోడీ కుటుంబ సభ్యులు చూపించి సుచల మాఝీ అలియాస్ సుచల అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

భార్య మీద డౌట్ మొదలైయ్యింది
వివాహం చేసుకున్న నకాఫోడీ, సుచల దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. డబ్బు సంపాధించే పనిలో నకాఫోడీ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. బయట ఎక్కువగా ఉంటున్న నకాఫోడీకి ఇంటి దగ్గరే ఉంటున్న అతని భార్య సుచల మీద రానురాను అనుమానం మొదలైయ్యింది.

భార్యను నమ్మలేకపోయిన భర్త
నా భార్య సుచల వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తనను మోసం చేస్తోందని నకఫోడీ రగిలిపోయాడు. ఇదే విషయంలో నకాఫోడీ, సుచల దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. నా భార్య సుచలను చంపేస్తే పీడపోతుందని నకాఫోడీ డిసైడ్ అయ్యాడు. ఇంటికి వెళ్లిన నకాఫోడీ అతని భార్య సుచలను చూసి రగిలిపోయాడు.

భార్య తల నరికేసి చేతిలో పట్టుకుని 12 కిలోమీటర్లు వాకింగ్
సహనం కోల్పోయిన నకాఫోడీ పదునైన వేటకొడవలితో అతని భార్య సుచల తల పూర్తిగా నరికేసి తల, మొండెం వేరు చేశాడు. భార్య సుచల తలకు ఉన్న జుట్టు చేతిలో పట్టుకున్న నకాఫోడీ చంద్రశేఖర్ పూర్ గ్రామం నుంచి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వాకింగ్ చేస్తున్నట్లు వెళ్లడం కలకలం రేపింది.

నా భార్య మోసం చేసింది..... నరికి చంపేశాను
నకాఫోడీ చేతిలో ఉన్న మహిళ తల చూసి చాలా మంది భయంతో పరుగు తీస్తే కొందరు అతన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నకాఫోడీ చేతిలో ఉన్న సుచల తలనుస్వాధీనం చేసుకున్నారు. నా భార్య సుచల ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, అందుకే నరికి చంపేశానని నకాఫోడీ పబ్లిక్ గా పోలీసులకు చెప్పడంతో అందరూ హడలిపోయారు.












Click it and Unblock the Notifications