Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త ఐరన్ చేస్తే ప్రియుడు డ్రైక్లీనింగ్ చేశాడు, భార్య ఏం చేసిందంటే ?, పాపం !

చెన్నై: భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటున్న భార్య పక్కదారి పట్టింది. భార్యతో చక్కగా సంసారం చేసుకుంటున్న భర్త జీవితం మీద ఓ పిడుగుపడింది. సంతోషంగా బట్టలు ఐరన్ చేసుకుంటూ జీవితం సాగిస్తున్న భర్త అతని భార్య దెబ్బతో పచ్చి తాగుబోతు అయ్యాడు. భర్త బాగా ఇస్త్రీ చేస్తే భార్యకు ఆమె ప్రియుడు బాగా డ్రైక్లీనింగ్ చేసి ఆమెను మడత పెట్టాడు. దెబ్బతో సంసారంలో గొడవలు మొదలైనాయి. రోజూ పాత మొగుడితో పంచాయితీలు ఏంది ? అంటూ విసిగిపోయిన భార్య ప్రియుడి మీద మోజుతో గాఢంగా నిద్రపోతున్న భర్త మీద ఐదు లీటర్ల పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటి బయట తాళం పెట్టి చక్కగా చక్కేసింది.

చక్కగా కాపుం చేస్తున్నారు

చక్కగా కాపుం చేస్తున్నారు


చెన్నై సిటీలోని మాడిపాక్కాం పెరియార్ ప్రాంతంలో పాండి ( 42), పార్వతి (34) దంపతులు నివాసం ఉంటున్నారు. ఐరన్ షాపు పెట్టుకున్న పాండి స్థానికుల దుస్తులు చక్కగా ఇస్త్రీ చేస్తూ డబ్బులు సంపాధిస్తు భార్య పార్వతిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. పెళ్లి జరిగిన తరువాత పార్వతి చక్కగా కొన్ని సంవత్సరా పాటు ఆమె భర్త పాండితో కాపురం చేసింది.

భర్త జీవితంలో కుదుపు

భర్త జీవితంలో కుదుపు


భర్త పాండి లేని సమయంలో, అతను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతని భార్య పార్వతి కూడా బట్టలు ఇస్త్రీ చేస్తోంది. ఇదే సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న సెల్వా అనే యువకుడు నాటుకోడి లాంటి పార్వతికి లైన్ వేశాడు. కొంతకాలానికి పార్వతి కూడా కుర్రాడు సెల్వాను చూడటం మొదలుపెట్టింది. ఇలా కొంతకాలం పార్వతి, కుర్రాడు సెల్వాకు చూపులు కలిశాయి. ఇదే భర్త పాండి జీవితాన్ని ఓ కుదుపు కుదిపేసింది.

భర్త బాగా ఇస్త్రీ చేస్తే..... ప్రియుడు మడతపెట్టేశాడు

భర్త బాగా ఇస్త్రీ చేస్తే..... ప్రియుడు మడతపెట్టేశాడు


పార్వతి, సెల్వా రానురాను దగ్గర అయ్యి ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకున్నారు. భరత్ పాండి చెరువులో ఇతరుల దుస్తులు ఉతికి శుభ్రం చేస్తుంటే అతని భార్య పార్వతిని ఆమె ప్రియుడు సెల్వా పీల్చిపిప్పి చేశాడు. భర్త పాండి బట్టలు బాగా ఇస్త్రీ చేస్తాడని ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. అయితే పార్వతి జీవితాన్ని ఆమె ప్రియుడు సెల్వా బాగా మడతపెట్టేసి క్లీన్ గా డ్రైక్లీనింగ్ చేసేశాడు.

 షాపు దగ్గర నీ పురాణంమే ఎక్కువ అయిపోయింది

షాపు దగ్గర నీ పురాణంమే ఎక్కువ అయిపోయింది

పార్వతి, ఆమె ప్రియుడు సెల్వా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త పాండికి తెలిసిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని, బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి షాపు దగ్గరకు వచ్చే వాళ్లు నీ రంకు పురాణం గురించి ఎక్కువగా నాకు చెబుతున్నారని, బజారులో మా పరువు మానం మర్యాద పోతావుందని పాండి భార్యను హెచ్చరించాడు. భర్త ఎంత చెప్పినా భార్య పార్వతి మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు.

దుమ్ము లేపిన భర్త.... కొంచెం కూడా పట్టించుకోని భార్య

దుమ్ము లేపిన భర్త.... కొంచెం కూడా పట్టించుకోని భార్య


భార్య పార్వతి పద్దతి మార్చుకోకపోవడంతో విసిగిపోయిన భర్త పాండి మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పగలు కూడా మద్యం సేవిస్తున్న పాండి రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లి కనపడిన కర్రలు, వస్తువులు తీసుకుని అతని భార్య పార్వతిని చితకబాదేశాడు. భర్త ఎంత కొట్టినా, బజారులో బూతులు మాట్లాడినా పార్వతి మాత్రం ఆమె ప్రియుడు సెల్వాను వదలకుండా అతనే కావాలని భర్త పాండికి తేల్చి చెప్పింది.

 భర్తను సజీవదహనం చెయ్యాలని సూపర్ స్కెచ్

భర్తను సజీవదహనం చెయ్యాలని సూపర్ స్కెచ్

రాత్రి భర్త పాండి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య పార్వతితో గొడవపడ్డాడు. ఇక ముందు తాను చక్కగా కాపురం చేసుకుంటానని, సెల్వాతో ఇకముందు మాట్లాడనని భార్య పార్వతి భర్త పాండికి మాయమాటలు చెప్పింది. మద్యం మత్తులో పాండి ఇంట్లో నిద్రపోయాడు. అంతే అప్పటికే ఇంట్లో తీసుకుని వచ్చి పెట్టిన ఐదు లీటర్ల పెట్రోల్ భర్త పాండి మీద పోసి ఒక్క అగ్గిపుల్ల గీసి అతని మీద విసిరేసింది.

Recommended Video

    #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Oneindia Telugu
    పెళ్లాం కాదు..... అది రాక్షసి

    పెళ్లాం కాదు..... అది రాక్షసి


    మంటలు తట్టుకోలేక పాండి గట్టిగా కేకలు వేశాడు. అప్పటికే పార్వతి ఇంటి బయట రోడ్ లాక్ చేసి అక్కడి నుంచి పరారైయ్యింది. పాండి గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి పాండిని రక్షించి కీల్ పాక్ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకులతో పోరాడుతున్న పాండి తన భార్య పార్వతి తన మీద పెట్రోల్ పోసి నిప్పింటించి హత్య చెయ్యలని స్కెచ్ వేసిందని, అది ఒక పెద్ద రాక్షసి, కామపిచాచి అంటూ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చాడు. పాండి శరీరం చాలా వరకు కాలిపోయిందని పోలీసులు అన్నారు. భర్త పాండిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన పార్వతి ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయ్నతించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+