Illegal affair: భార్య పేరుతో కోట్ల ఆస్తి, పేరుకే భర్త ఎండీ, ఆంటీ నైట్ పార్టీలు, పక్కా స్కెచ్ తో !
లూథియానా/పంజాబ్/ చెన్నై: ప్రముఖ ఫ్యాక్టరీతో పాటు కొన్ని కంపెనీలకు పేరుకు మాత్రమే ఎండీగా, యజమానిగా పని చేస్తున్న వ్యక్తి పైకి సంతోషంగా గడుపుతున్నాడు. అయితో లోపలలోపల ఆయనకు ఎందో తెలియని ఆందోళన. కొడుకు, కోడలు కూడా వ్యాపారం చెయ్యడానికి పూర్తిగా సహకరించారు. అయితే భార్య పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం ఉండటంతో భర్తకు రానురాను టెన్షన్ మొదలైయ్యింది. తాను కంపెనీలకు మాత్రమే ఎండీ అని, ఆస్తులు మొత్తం తన భార్య పేరుతో ఉన్నాయని భర్తకు ఓ ఫీలింగ్. ఇదే సమయంలో నైట్ పార్టీలకు వెలుతున్న భార్య అక్రమ సంబంధం విషయం గురించి భర్తకు తెలిసింది. అంతే పక్కా స్కెచ్ ప్రకారం ఆంటీని చంపేసి అంకుల్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. తల్లిని చంపడానికి కొడుకు, కోడలు కూడా సహకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

కోటీశ్వరుల ఫ్యామిలీ
పంజాబ్ లోని లూథియానాలోని మోడల్ టౌన్ లోని అటామ్ నగర్ లో హర్మేష్ అరోరా (50), ఆర్తీ అరోరా (48) దంపతులు నివాసం ఉంటున్నారు. హర్మేష్ అరోరా, ఆర్తీ అరోరా దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు పెళ్లిచేసిన హర్మేష్ అరోరా, ఆర్తీ దంపతులు సంతోషంగా ఉంటున్నారు. కొడుకు, కోడలు హ్యపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అరోరా కుటుంబం కోటీశ్వరుల ఫ్యామిలి, వీరికి అనేక వ్యాపారాలు ఉన్నాయి.

ఆంటీ పేరుతో రూ. కోట్ల విలువైన ఆస్తులు
అరోరా అల్లోయ్స్ సంస్థలకు ఆర్తీ అరోరా శాస్వత డెరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆర్తీ అరోరా భర్త హర్మేష్ అరోరా మాత్రం అరోరా ఫ్యాక్టరీస్ మేనేజింగ్ డైరక్టర్ (MD)గా పని చేస్తున్నాడు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు మొత్తం భార్య ఆర్తీ అరోరా పేరుతో ఉన్నాయి. ఆస్తులు మొత్తం తన భార్య ఆర్తీ అరోరా పేరుతో ఉన్నాయని హర్మేష్ ఆరోరాకు బాధగా ఉండేదని తెలిసింది.

ఆంటీకి అక్రమ సంబంధం..... లగ్జరీ లైఫ్ ?
ఆర్తీ అరోరా చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా, లావుగా, పొడవుగా ఉంటున్న ఆర్తీ అరోరా కొడుక్కు పెళ్లి చేసినా ఆమె చాలా స్టైలిష్ గా ఉంటుందని, ఎప్పుడు చక్కగా రెఢీ అయ్యి నైట్ పార్టీలకు వెలుతుంటుందని సమాచారం. ఇదే సమయంలో తన భార్య ఆర్తీ అరోరాకు అక్రమ సంబంధం ఉందని, అందుకే తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని హర్మేష్ అరోరాకు అనుమానం పెరిగిపోయింది. భార్య ఆర్తీ అరోరా తీరుతో ఆమె భర్త హర్మేష్ అరోరాకు రానురాను అనుమానం ఎక్కువ అయ్యింది.

భార్య ఆస్తుల కోసం భర్త స్కెచ్
తన భార్య ఆర్తీ అరోరా అక్రమ సంబంధంతో ఆస్తులు మొత్తం ఆమె ప్రియుడికి రాసిచ్చేస్తుందని హర్మేష్ అరోరాకు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో హర్మేష్ అరోరా, ఆర్తీ అరోరాల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయని తెలిసింది. తన భార్య ఆర్తీ అరోరాను చంపేసి ఆమె పేరుతో ఉన్న ఆస్తులు మొత్తం తానే స్వాధీనం చేసుకోవాలని ఆమె భర్త హర్మేష్ అరోరా ప్లాన్ వేశాడు.

కొడుకు, కోడలు ఎంట్రీతో ఫినిష్
తన మాట వినకుండా పార్టీలు, పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న భార్య ఆర్తీ అరోరాను చంపేయాలని డిసైడ్ అయిన హర్మేష్ అరోరాకు అతని కొడుకు, కోడలు కూడా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి పక్కాప్లాన్ ప్రకారం ఇంట్లో పొగపెట్టి ఆర్తీ అరోరాకు ఊపిరిరాకుండా చేసి ఆమెను చంపేశారు. తరువాత ఆర్తీ అరోరాను మోడల్ టౌన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆర్తీ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని వైద్యులకు మాయమాటలు చెప్పారు. అప్పటికే ఆర్తీ అరోరా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

కుంద్రా ఎంట్రీతో సీన్ సిడేల్
ఆర్తీ అరోరా సోదరుడు రాజన్ కుంద్రాతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న బంధువులకు విషయం తెలిసి ఆసుపత్రికి వెళ్లారు. తన సోదరి ఆర్తీ అరోరా మరణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని రాజన్ కుంద్రా పోలీసులను పిలిచాడు. ఆర్తీ అరోరా గొంతు, మెడ మీద గోర్లతో గిచ్చిన గుర్తులు ఉన్నాయని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని, తన బావ హర్మేష్ అరోరా మీద తనకు అనుమానాలు ఉన్నాయని ఆర్తీ అరోరా సోదరుడు రాజన్ కుంద్రా పోలీసు కేసు పెట్టాడు. ఆస్తుల కోసం తన సోదరి ఆర్తీ అరోరాను ఆమె భర్త చంపేశాడని రాజన్ కుంద్రా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇంట్లో ఇదంతా ఎలా జరిగింది ? ఎందుకు ఇలా అయ్యింది
పోలీసులు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆర్తీ అరోరా ఇంటికి చేరుకుని పరిశీలించారు. ఆర్తీ అరోరా బెడ్ రూమ్ లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న విషయం పోలీసులు గుర్తించారు. భర్త హర్మేష్ అరోరా హత్య చేసే సమయంలో ఆర్తీ అరోరా తప్పించుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఇంటిలోని వస్తులులు చెల్లాచెదురు అయ్యాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
Recommended Video

అక్రమ సంబంధం, ఆస్తుల కోసం హత్య
తన భార్య ఆర్తీ అరోరాకు అక్రమ సంబంధం ఉందని, ఎక్కడ ఆస్తులు ఆమె వేరే వాళ్లకు రాసిఇస్తుందో అనే భయంతో ఆమెను హత్య చేశానని హర్మేష్ అరోరా అంగీకరించాడని లూథియానా పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఆర్తీ అరోరా హత్య కేసులో ఆమె కొడుకు, కోడలిని ఇంకా అరెస్టు చెయ్యలేదని, వారిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు, ఆస్తుల కోసం ఆర్తీ అరోరా హత్యకు గురి కావడంతో లూథియానాలో హాట్ టాపిక్ అయ్యింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications