Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్య అన్న భార్యతో ?, వరుసకు చెల్లెలు, జాకీ రాడ్ తో చంపేసి, ఉరి వేసుకుని!

లక్నో: కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త సొంతంగా కారు తీసుకుని అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు. వివాహం జరిగి 13 సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. తన కోడలికి పిల్లలు పుట్టలేదని, మా వంశం ఇంతటితో అంతం అయిపోతుందని భర్త తల్లి పలువురి దగ్గర చెప్పిందని సమాచారం. పిల్లల పుట్టలేదనే విషయంలో రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో భార్య సోదరుడి భార్యతో కారు డ్రైవర్ ఎక్కువ చనువు పెంచుకున్నాడు.

ఇదే సమయంలో భార్య సోదరుడు చనిపోవడంతో అతని భార్యతో కారు డ్రైవర్ టూర్లు వెయ్యడం మొదలు పెట్టాడు. వరుసకు సోదరి అయ్యే మహిళతో నువ్వు ఎందుకు అంత చనువు పెంచుకుంటున్నావని, ఆమె నీకు మరదలు కాదని భార్య ఆమె భర్తను నిలదీసింది. దంపతుల మధ్య ఈ విషయం కూడా గొడవలకు దారి తీసింది. జాకీ రాడ్ తీసుకున్న భర్త అతని భార్య తల చితకబాది చంపేశాడు. నేను నా భార్యను చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బంధువుకు ఫోన్ చేసి చెప్పిన భర్త ఉరి వేసుకున్నాడు.

కారు ఓనర్ పెళ్లి

కారు ఓనర్ పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో సుశీల్ కుమార్ యాదవ్ అలియాస్ సుశీల్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2009లో మీరా (35) అనే మహిళను సుశీల్ కుమార్ యాదవ్ వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న సుశీల్ కుమార్, మీరా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సుశీల్ కుమార్ సొంతంగా కారు తీసుకుని అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు.

కోడలికి పిల్లలు పుట్టలేదని అత్త ఆవేదన

కోడలికి పిల్లలు పుట్టలేదని అత్త ఆవేదన

వివాహం జరిగిన 13 సంవత్సరాలు అయినా సుశీల్ కుమార్, మీరా దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. భార్య మీరాకు కొన్ని ఆసుపత్రుల్లో పిల్లలు పుట్టడానికి ఆమె భర్త సుశీల్ కుమార్ వైద్యం చేయించాడని తెలిసింది. వివాహం జరిగి 13 సంవత్సరాలు అయినా మా కోడలు మీరాకు పిల్లలు పుట్టలేదు. తన కొడుకుతో మా వంశం ఇంతటితో అంతం అయిపోతుందని భయంగా ఉందని సుశీల్ కుమార్ తల్లి పలువురు బంధువుల దగ్గర ఆవేదనతో చెప్పిందని సమాచారం.

రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పిన తల్లి?

రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పిన తల్లి?

నువ్వు నీ భార్య మీరాకు విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని సుశీల్ కుమార్ మీద ఆమె తల్లి ఎక్కువగా ఒత్తిడి చేసిందని మీరా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో సుశీల్ కుమార్ కూడా ఎక్కువగా ఆలోచించేవాడని మీరు బంధువులు ఆరోపిస్తున్నారు.

భార్య వదినతో క్లోజ్ అయిపోయాడు

భార్య వదినతో క్లోజ్ అయిపోయాడు

మీరుకు దయా అనే అన్న ఉన్నాడు. దయా భార్యతో సుశీల్ కుమార్ ఎక్కువ చనువు పెంచుకుని తిరగాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం భార్య మీరాకు తెలీకుండా సుశీల్ కుమార్ చాలాకాలం జాగ్రత్తపడ్డాడని తెలిసింది. ఆరు నెలల క్రితం మీరా సోదరుడు దయా అనారోగ్యంతో చనిపోయాడు.

వరుసకు చెల్లెలితో అక్రమ సంబంధం

వరుసకు చెల్లెలితో అక్రమ సంబంధం

దయా చనిపోయినప్పటి నుంచి అతని భార్యతో సుశీల్ కుమార్ టూర్లు వెయ్యడం మొదలు పెట్టాడని మీరా తల్లి శోభావతి యాదవ్ (దయా తల్లి) ఆరోపిస్తోంది. వరుసకు నీకు సోదరి అయ్యే మా అన్న దయా భార్యతో నువ్వు ఎందుకు అంత చనువు పెంచుకుంటున్నావని, ఆమె నీకు మరదలు కాదని మీరా ఆమె సుశీల్ కుమార్ ను నిలదీసింది.

భార్యను చంపేసి ఉరి వేసుకున్న భర్త

భార్యను చంపేసి ఉరి వేసుకున్న భర్త

సుశీల్ కుమార్, మీరా దంపతుల మధ్య దయా భార్య అక్రమ సంబంధం విషయం కూడా గొడవలకు దారి తీసింది. నిత్యం పదేపదే సుశీల్ కుమార్, మీరా దంపతుల మద్య రచ్చరచ్చ అయ్యింది. సహనం కోల్పోయిన సుశీల్ కుమార్ బుధవారం రాత్రి జాకీ రాడ్ తీసుకుని అతని భార్య మీరా తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేశాడు. నేను నా భార్య మీరాను చంపేశానని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని బంధువుకు ఫోన్ చేసిన సుశీల్ కుమార్ ఉరి వేసుకున్నాడు.

కరోనా దెబ్బతో ఆసుపత్రిలో చేరిన భర్త

కరోనా దెబ్బతో ఆసుపత్రిలో చేరిన భర్త

విషయం తెలుసుకున్న బంధువు పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే సుశీల్ కుమార్ ఇంటికి చేరుకున్నాడు. ఫ్యాన్ కు వేలాడుతున్న సుశీల్ కుమార్ ను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. సుశీల్ కుమార్ కు వైద్యపరీక్షలు చేయించడంతో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసిందని, అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

నా కూతురితో కాపురం, నా కొడుకు భార్యతో అక్రమ సంబంధం

నా కూతురితో కాపురం, నా కొడుకు భార్యతో అక్రమ సంబంధం

గతంలో కూడా సుశీల్ కుమార్ వేధింపులు ఎక్కువ కావడంతో తన కుమార్తె కేసు పెట్టిందని, ఆ సమయంలో పెద్దలు రాజీ చెయ్యడంతో కేసు వెనక్కి తీసుకున్నామని, ఇప్పుడు నా కొడుకు దయా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తన అల్లుడు సుశీల్ కుమార్ నా కూతురు మీరాను చంపేశాడని ఆమె తల్లి శోభాయాదవ్ పోలీసు కేసు పెట్టింది.

సుశీల్ కుమార్ యాదవ్ కరోనా వైరస్ నుంచి కోలుకున్న వెంటనే అరెస్టు చేసి విచారణ చేస్తామని లక్నో సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+