Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !

ఉజ్జయిని/భోపాల్: రెండు సంవత్సరాల క్రితం యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత భర్త అతని భార్యతో సంతోషంగా ఉన్నట్లు నటించాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. పెద్దలు పంచాయితీలు చేస్తే వాళ్లకు భర్త ఏదో ఒకసినిమా స్టోరీ చెప్పి ఆ సమయంలో సింపుల్ గా తప్పించుకుంటున్నాడు, తరువాత మళ్లీ భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో భర్త ఆగడాలు మరీ ఎక్కువ అయ్యాయి. బిడ్డకు పాలు తాగించిన భార్య ఆడిస్తోంది. ఆ సమయంలో కొడుకు ముందే భార్యను దారుణంగా చంపేసిన భర్త చేతులు దులుపుకోవడానికి పోలీసులకు ఫోన్ చేసి ఓ పాత సినిమా స్టోరీ చెప్పి అడ్డంగా బుక్కైపోయాడు.

 భర్తతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్న భార్య

భర్తతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్న భార్య

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలోని రత్లాంలో దేవాజీ అలియాస్ దేవా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం దేవా సంగీతా బాయి అలియాస్ సంగీతా (23) అనే యువతని పెళ్లి చేసుకున్నాడు. సంగీతాను పెళ్లి చేసుకున్న తరువాత దేవా అతని భార్యతో సంతోషంగా ఉన్నట్లు నటించాడు.

 పెళ్లికి ముందే భర్తకు ప్రియురాలు

పెళ్లికి ముందే భర్తకు ప్రియురాలు

దేవా, సంగీతా దంపతులకు 13 నెలల కుమారుడు ఉన్నాడు. సంగీతాను పెళ్లి చేసుకోకముందు నుంచి దేవాకు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉంది, అయితే పెద్దల ఒత్తిడితొ దేవా సంగీతాను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంట్లో భార్య సంగీతా ఉన్నా, కొడుకు పుట్టినా దేవా మాత్రం అతని ప్రియురాలి ప్రతినిత్యం కలిసేవాడు.

 భర్త అక్రమ సంబంధం లీక్

భర్త అక్రమ సంబంధం లీక్

కొన్ని నెలల క్రితం దేవా అక్రమ సంబంధం విషయం అతని భార్య సంగీతాకు తెలిసిపోయింది. ఇదే విషయంలో సంగీతా, దేవా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలంగా దేవా అతని భార్య సంగీతాను పట్టుకుని చితకబాదుతున్నాడు. పెద్దలు పంచాయితీలు చేస్తే వాళ్లకు దేవా ఏదో ఒకసినిమా స్టోరీ చెప్పి ఆ సమయంలో సింపుల్ గా తప్పించుకుంటున్నాడు,

 కొడుకు ముందే భార్యను చంపేసిన భర్త

కొడుకు ముందే భార్యను చంపేసిన భర్త

పెద్దలు పంచాయితీలు చేసి వెళ్లిపోయిన తరువాత మళ్లీ దేవా అతని భార్య సంగీతాను పట్టుకుని చితకబాదడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో దేవా ఆగడాలు మరీ ఎక్కువ అయ్యాయి. రాత్రి సంగీతా భిడ్డకు పాలుతాగించి బాలుడిని ఆడిస్తోంది. ఆ సమయంలో నా అక్రమ సంబందానికి నువ్వు అడ్డుపడుతున్నావని రెచ్చిపోయిన దేవా కొడుకు కళ్ల ముందే అతని భార్య సంగీతాను గొంతు కోసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 నాటకాలు ఆడిన భర్త

నాటకాలు ఆడిన భర్త

భార్య సంగీతాను హత్య చేసిన దేవా తప్పించుకోవడానికి సినిమా స్టోరీ అల్లాడు. ఇంట్లో ఉన్న తన భార్యను నలుగురు వ్యక్తులు గొంతు కోసి చంపేశారని, ఇంట్లో ఉన్న నగలు, నగదు లూటీ చేశారని, తాను ప్రాణాలతో తప్పించుకున్నానని పోలీసులకు చెప్పిన దేవా కేసు నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. దేవా చెప్పేమాటల్లో తేడాలు ఉండటంతో అతన్నిఅరెస్టు చేశామని, తన అక్రమ సంభంధానికి నా భార్య సంగీతా అడ్డుగా ఉందని, అందుకే ఆమెను చంపేశానని దేవా అంగీకరించాడని ఉజ్జయిని జిల్లా ఎస్పీ స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+