Illegal affair: ప్రియుడితో లేచిపోయిన భార్య, అవమానంతో కొడుకును చంపేసి భర్త ఏం చేశాడంటే !

గురుగ్రామ్/చెన్నై: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. భార్య, పిల్లలతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని అతను ఎన్నో కలలుకన్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య ఇంట్లోనే ఉంటున్నది. ఇదే సమయంలో పరిచయం అయిన పెళ్లి కాని యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలాకాలం భార్య అక్రమ సంబంధం సీక్రేట్ గా సాగిపోయింది. కొంతకాలం క్రితం భార్య అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోయింది. అప్పటి నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భార్య తీరు మాత్రం మారలేదు. భార్య ప్రియుడితో కలిసి లేచిపోయింది. అవమానం తట్టుకోలేక భర్త అతని కొడుక్కి విషయం తాగించి హత్య చేసి అతను విషం సేవించడం కలకలం రేపింది.

భార్యతో హ్యాపీలైఫ్

భార్యతో హ్యాపీలైఫ్


గురుగ్రామ్ లో రాజేష్ మిట్టల్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పాయల్ (32) అనే యువతిని రాజేష్ మిట్టల్ వివాహం చేసుకున్నాడు. పాయల్, రాజేష్ మిట్టల్ దంపతులు మోహిత్ (10), భరత్ (4) అనే ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులు అయ్యారు.

 పెళ్లి కాని కుర్రాడు ఎంట్రీ

పెళ్లి కాని కుర్రాడు ఎంట్రీ

భార్య పాయల్, ఇద్దరు కొడుకులతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని రాజేష్ మిట్టల్ ఎన్నో కలలుకన్నాడు. వ్యాపారం చేస్తున్న రాజేష్ మిట్టల్ బయటకు వెలుతున్నాడు. పాయల్ ఆమె ఇద్దరు కొడుకులతో కలసి ఇంట్లోనే ఉంటున్నది. ఇదే సమయంలో పాయల్ కు పెళ్లికాని కుర్రాడు మోను అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య

ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య

తనకు పరిచయం అయిన పెళ్లికాని మోనుతో పాయల్ చనువు పెంచుకుంది. మోను, పాయల్ ల చనువు అక్రమ సంబంధానికి దారితీసింది. చాలాకాలం రాజేష్ మిట్టల్ భార్య పాయల్, మోనుల అక్రమ సంబంధం సీక్రేట్ గా సాగిపోయింది. భర్త రాజేష్ మిట్టల్ వ్యాపారం పనిమీద బయట ఊర్లకు వెళ్లిన సమయంలో పాయల్ ఆమె ప్రియుడు మోనుతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి జల్సా చేసింది.

భార్య పద్దతి మాత్రం మారలేదు

భార్య పద్దతి మాత్రం మారలేదు

కొంతకాలం క్రితం పాయల్ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజేష్ మిట్టల్ కు తెలిసిపోయింది. నువ్వు పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని రాజేష్ మిట్టల్ అతని భార్య పాయల్ ను హెచ్చరించాడు. ఇదే విషయంలో పెద్దలు పంచాయితీలు చేసినా పాయల్ మాత్రం ఆమె బుద్ది మార్చుకోలేదని తెలిసింది.

ప్రియుడితో పారిపోయిన భార్య...... అవమానంతో ?

ప్రియుడితో పారిపోయిన భార్య...... అవమానంతో ?

రాజేష్ మిట్టల్, పాయల్ దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం పాయల్ ఆమె ప్రియుడు మోనుతో కలిసి పారిపోయింది. తన భార్య పాయల్ ఆమె ప్రియుడితో లేచిపోయిందని నిర్ధారించుకున్న రాజేష్ మిట్టల్ అవమానంతో కుంగిపోయాడు.

కొడునుకు చంపి విషం తాగేశాడు

కొడునుకు చంపి విషం తాగేశాడు


పెద్ద కొడుకు మోహిత్ అంగడికి వెళ్లిన సమయంలో రాజేష్ మిట్టల్ అతని చిన్న కొడుకు భరత్ కు విషం తాగించాడు. అదే సమయంలో రాజేష్ మిట్టల్ కూడా విషం తాగేశాడు. బాధ తట్టుకోలేక రాజేష్ మిట్టల్ కేకలు వేశాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజేష్ మిట్టల్, అతని కొడుకు భరత్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే భరత్ అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు.

కేసు పెట్టిన రాజేష్ సోదరి

కేసు పెట్టిన రాజేష్ సోదరి

రాజేష్ మిట్టల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. భార్య పాయల్ ఆమె ప్రియుడితో లేచిపోవడం తట్టుకోలేక రాజేష్ మిట్టల్ కొడుకు భరత్ కు విషం తాగించి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని అతని సోదరి కేసు పెట్టిందని, పాయల్, ఆమె ప్రియుడు మోను కోసం గాలిస్తున్నామని గురుగ్రామ్ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+