Illegal affair: నేను లేని టైమ్ లో ఎవరో వస్తున్నారు ?, కట్టుకున్నోడికి కాటన్ చీర, సీక్రేట్ గా సిల్క్ చీర!
ముంబాయి/పాల్గార్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న యువకుడు తీరిక సమయంలో అతని భార్యను బయటకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం బయటకు వెలుతున్న భర్త రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. నేను ఇంట్లో లేని సమయంలో తన భార్య ఎక్కువగా సింగారించుకుని రెడీ అవుతోందని, నేను లేని టైమ్ లో ఆమె ఎందుకు అందంగా రెడీ అవుతోంది ? అంటూ భర్తకు అనుమానం పెరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి ఎవరో వచ్చి వెలుతున్నారని, ఏదో చేస్తున్నారని భర్తకు అనుమానం వచ్చింది.
ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను దంపతుల గొడవలు తారాస్థాయికి చేరాయి. భర్త ఎంత ఆవేశంగా ఊగిపోతే అంతకంటే ఎక్కువగా భార్య కూడా ఊగిపోయిందని సమాచారం. ఇక లాభం లేదని తెలుసుకున్న భర్త అతని భార్యను దారుణంగా చంపేసి రాష్ట్రం వదిలిపారిపోవడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాల క్రితం?
మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని తులింజ్ ప్రాంతంలో రమేష్ మెహతో (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన నీలందేవి (27) అనే యువతిని రమేష్ మెహతో వివాహం చేసుకున్నాడు. నీలందేవిని వివాహం చేసుకున్న రమేష్ అతని భార్యతో సంతోషంగా ఉంటున్నాడు.

భార్యతో సంతోషంగా ఉన్నాడు
వ్యాపారం చేస్తున్న రమేష్ తీరిక సమయంలో అతని భార్య నీలం దేవిని బయటకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నీలందేవి ఏమి అడిగినా రమేష్ ఆమెకు అది తీసిస్తూ చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిసింది. ప్రతిరోజూ ఉదయం బయటకు వెలుతున్న రమేష్ రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రమేష్ భార్య నీలందేవి ఇంటి దగ్గరే ఉంటున్నది.

నా భార్య ఎందుకు అందంగా రెడీ అవుతోంది?
నేను ఇంట్లో లేని సమయంలో తన భార్య నీలందేవి ఎక్కువగా సింగారించుకుని రెడీ అవుతోందని, నేను లేని టైమ్ లో ఆమె ఎందుకు అందంగా రెడీ అవుతోంది ? అంటూ ఆమె భర్త రమేష్ కు అనుమానం పెరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయంలో నా భార్య నీలందేవి ఏం చేస్తోంది అంటూ రమేష్ కొంతకాలంగా ఆరా తియ్యడం మొదలుపెట్టాడు.

నా ఇంటికి ఎవరో వచ్చి వెలుతున్నారు ?, ఎవరు
నేను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి తన భార్య నీలందేవి కోసం ఎవరో వచ్చి వెలుతున్నారని రమేష్ కు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో రమేష్, నీలందేవి దంపతుల మద్య నిత్యం గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను రమేష్, నీలందేవి దంపతుల గొడవలు తారాస్థాయికి చేరాయి. భర్త రమేష్ ఎంత ఆవేశంగా ఊగిపోతే అంతకంటే ఎక్కువగా అతని భార్య నీలందేవి కూడా ఆవేశంతో ఊగిపోయిందని సమాచారం.

భార్య గొంతు కోసి చంపేసి భర్త ఎస్కేప్
గత నెల 29వ తేదీన రమేష్, నీలందేవి దంపతుల మద్య ఇదే విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రమేష్ మొబైల్ ఫోన్ చార్జర్ తీసుకుని అతని భార్య నీలందేవి గొంతు బిగించాడు. నీలందేవి కిందపడిపోయిన తరువాత ఆమె గొంతు కోసేసి చంపేసిన రమేష్ పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్య నీలందేవిని హత్య చేసిన రమేష్ గుజరాత్ పారిపోయాడు.

నా భార్య నన్ను మోసం చేసింది
గుజరాత్ లోని సూరత్ లో రమేష్ తలదాచుకున్నాడని కచ్చితమైన సమాచారం అందడంతో అతన్ని అక్కడే అరెస్టు పాల్గార్ తీసుకువచ్చామని సీనియర్ పోలీసు అధికారి కైలాష్ బార్వే స్థానిక మీడియాకు చెప్పారు. భార్య నీలందేవి అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని చంపేశానని రమేష్ మెహతో అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications