Illegal affair: ఏఎఫ్ఓ భార్య స్కెచ్, ఇంట్లో భర్త సజీవదహనం, పక్కరూమ్ లో నా భార్య, డీఎఫ్ఓ!
హైదరాబాద్/ బెర్హమ్ పూర్: భార్యతో కలిసి ఫారెస్ట్ ఆఫీసర్ క్వాటర్స్ లో నివాసం ఉంటున్నాడు. క్వాటర్స్ పక్కన ఉన్న మరో క్వాటర్స్ లో ఫారెస్టు ఆఫీసర్ సీనియర్ అధికారి నివాసం ఉంటున్నాడు. రాత్రి ఇంట్లో ఏఎఫ్ఓ అధికారి, ఆయన భార్య ఉన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత భర్తకు నిప్పంటుకుని 90 శాతం కాలిపోయాడు. తీవ్రగాయాలైన భర్తను ఆసుపత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు పోయాయి. తనకు నిప్పంటుకున్న సమయంలో పక్క రూమ్ లో తన భార్య, తన సీనియర్ అధికారి డీఎఫ్ఓ, వంట మనిషి ఉన్నారని మెజిస్ట్రేట్ కు స్టేట్ మెంట్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది.

క్వారట్స్ లో దంపతులు
ఒడిశాలోని బెర్హమ్ పూర్ సమీపంలోని పరాలఖేముండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ క్వారట్స్ లో అటవి శాఖలో అసిస్టెంట్ కన్సర్వేటర్ అధికారి (ACF) గా ఉద్యోగం చేస్తున్న సౌమ్య రంజన్ మహాపాత్రో (32), ఆయన భార్య బిడియా భారతి పాండా దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య బిడియా భారతీతో రంజన్ మహాపాత్రో కొంతకాలం హ్యాపీగా ఉంటున్నాడు.

నిప్పంటుకుని భర్త ప్రాణాలు పోయాయి
రాత్రి క్వాటర్స్ లోని ఇంటిలో రంజన్ మహాపాత్రో, ఆయన భార్య బిడియా భారతీ ఉన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత రంజన్ మహాపాత్రోకు నిప్పంటుకుని తీవ్రగాయాలైనాయి. వెంటనే రంజన్ ను బెర్హాంపూర్లోకి ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజన్ 90 శాతం కాలిపోయాడు. తరువాత కటక్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై రంజన్ మహాపాత్రో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు.

పక్క రూమ్ లో నా భార్య, నా సీనియర్ అధికారి ?
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రంజన్ పరాలఖేముండి పోలీసులకు, మెజిస్ట్రేట్ కు స్టేట్ మెంట్ ఇచ్చారు. రాత్రి తనకు ఎలా నిప్పంటుకునిందో తెలీదని, ఆ సమయంలో పక్క రూమ్ లో తన భార్య బిడియా భారతి, తన సీనియర్ అధికారి డీఎఫ్ఓ గజపతి ఉన్నారని, తన ఇంట్లో వంట మనిషి కూడా ఉన్నాడని రంజన్ మహాపాత్రో స్టేట్ మెంట్ ఇచ్చి ప్రాణాలు వదిలేశాడు.

పక్క క్వాటర్స్ లో అధికారితో ?
రంజన్ మహాపాత్రో నివాసం ఉంటున్న పక్క క్వాటర్స్ లో ఫారెస్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) గజపతి నివాసం ఉంటున్నాడు. భర్త రంజన్ మహాపాత్రో సీనియర్ అధికారి అయిన గజపతితో బిడియా భారతి అక్రమ సంబంధం సాగిస్తోందని, ఇద్దరు కలిసి తన కుమారుడిని నిప్పంటించి చంపేశారని రంజన్ మహాపాత్రో తండ్రి అభిరామ్ మహాపాత్రో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్య, సీనియర్ అధికారి, వంట మనిషి మీద హత్య కేసు
రంజన్ మహాపాత్రో సజీవదహనం అయిన కేసులో అతని భార్య బిడియా భారతీ, డీఎఫ్ఓ గజపతితో పాటు వంట మనిషి మీద హత్య కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పరాలఖేముండి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బిబేకానంద్ స్వైన్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. భర్త రంజన్ కు మంటలు వ్యాపించి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయే సమయంలో పక్క రూమ్ లో అతని భార్య భారతీ, సీనియర్ అధికారి గజపతి ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications