Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్యకు ప్రియుడు, యముడైన మొగుడు, భార్య, అత్త, ప్రియుడిపై కాల్పులు, లవర్ ఔట్ !

లూథియానా/చెన్నై: వివాహం చేసుకున్న మహిళ భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్తతో కాపురం చేస్తున్న భార్య బంగారు నగల షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నది. భర్త కూడా కాలేజ్ లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలతో కలిసి దంపతులు హ్యాపీగా ఉంటున్నారు. ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునిందని భర్తకు అనుమానం ఉంది. భార్య, భర్తలు ఇదే విషచయంలో గొడవలు పడటంతో మహిళ తల్లి జోక్యం చేసుకుంటూ వచ్చింది. తన సంసారం విషయంలో అత్త జోక్యం చేసుకోవడం ఇష్టం లేని అల్లుడు అనేకసార్లు అత్త మీద మండిపడుతూ వచ్చాడు. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరగడం, అత్త ఎంట్రీ ఇవ్వడం కామన్ గా మారిపోయింది. నా విషయంలో మీ అమ్మ జోక్యం చేసుకుంటే ఆమెను చంపేస్తానని రెండు రోజుల క్రితం భర్త అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరిగినా అత్త జోక్యం చేసుకోవడంతో అల్లుడు రగిలిపోయాడు. రివాల్వర్ తీసుకుని భార్య, అత్తను కాల్చి పారేశాడు. భార్య, అత్తను రివాల్వర్ తో కాల్చిన వ్యక్తి 30 కిలోమీటర్లు బైక్ లో వెళ్లి భార్య ప్రియుడిని కాల్చి చంపేయడం కలకలం రేపింది.

దంపతులకు ఇద్దరు పిల్లలు

దంపతులకు ఇద్దరు పిల్లలు

ఛండీగడ్ లోని లూథియానాలోని పటేల్ నగర్ లో జస్వీందర్ సింగ్ అలియాస్ జస్వీందర్ నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం శివాని అలియాస్ జస్ప్రీత్ కౌర్ అనే మహిళను జస్వీందర్ సింగ్ వివాహం చేసుకున్నాడు. జస్వీత్ సింగ్, శివానీ దంపతులకు 9 సంవత్సరాల వయసు ఉన్న కొడుకు, ఆరు సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉన్నారు.

దంతపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు

దంతపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు


భర్త జస్వీందర్ సింగ్ తో కాపురం చేస్తున్న భార్య శివానీ బంగారు నగల షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నది. భర్త జస్విందర్ సింగ్ కూడా జలంధర్ లోని కాలేజ్ లో అడ్మిషన్ కోఆర్డినేటర్ గా ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలతో కలిసి శివానీ, జస్విందర్ సింగ్ దంపతులు 13 సంవత్సరాలు హ్యాపీగా జీవించారు. తరువాత ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయని సమాచారం.

భార్యకు అక్రమ సంబంధం ?

భార్యకు అక్రమ సంబంధం ?

ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య శివానీ నూర్ మహల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రోహిత్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునిందని భర్త జస్విందర్ సింగ్ కు అనుమానం ఉంది. భార్య, భర్తలు ఇదే విషచయంలో గొడవలు పడటంతో శివానీ తల్లి వందన నిఖి జోక్యం చేసుకుంటూ వచ్చింది. తన సంసారం విషయంలో అత్త వందన లిఖి జోక్యం చేసుకోవడం ఇష్టం లేని అల్లుడు జస్వీందర్ సింగ్ అనేకసార్లు అత్త వందన మీద మండిపడుతూ వచ్చాడు.

రెచ్చిపోతున్న అత్త వందన

రెచ్చిపోతున్న అత్త వందన

కొంతకాలంగా జస్వీందర్, శివానీ దంపతుల మద్య రోహిత్ విషయంలో గొడవలు జరగడం, అత్త వందన ఎంట్రీ ఇవ్వడం కామన్ గా మారిపోయింది. నా విషయంలో మీ అమ్మ వందన జోక్యం చేసుకుంటే ఆమెను చంపేస్తానని రెండు రోజుల క్రితం భర్త జస్వీందర్ సింగ్ అతని భార్య శివానీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరిగినా అత్త వందన జోక్యం చేసుకోవడంతో అల్లుడు జస్వీందర్ సింగ్ రగిలిపోయాడు.

భార్య, అత్తను కాల్చిపారేసిన అల్లుడు

భార్య, అత్తను కాల్చిపారేసిన అల్లుడు

ఇంత జరిగినా అత్త వందన మళ్లీ జోక్యం చేసుకోవడంతో అల్లుడు జస్వీందర్ సింగ్ రగిలిపోయాడు. రివాల్వర్ తీసుకున్న జస్వీందర్ సింగ్ అత్త వందన మీద కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె దవడలో, మరో బుల్లెట్ ఆమె భుజంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో తల్లి వందన మీద కాల్పులు జరుపుతున్న భర్త జస్వీందర్ సింగ్ ను అడ్డుకోవడానికి శివానీ ప్రయత్నించింది. సహనం కోల్పోయిన జస్వీందర్ సింగ్ అదే రివాల్వర్ తో భార్య శివానీ మీద కాల్పులు జరిపాడు.

అమ్మా. కూతురు సీరియస్

అమ్మా. కూతురు సీరియస్

అమ్మా, కూతురు ఇద్దరూ కుప్పలిపోయారు. వెంటనే అక్కడి నుంచి జస్వీందర్ సింగ్ బైక్ లో వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన శివానీ, ఆమె తల్లి వందనాను లూథియానాలోని దయానంద సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లీ వందన, కూతురు శివానీ పరిస్థితి విషమంగానే ఉందని జలంధర్ ఎస్పీ నవీస్ సింగ్లా మీడియాకు చెప్పారు.

భార్య ప్రియుడు స్పాట్ లో ఔట్

భార్య ప్రియుడు స్పాట్ లో ఔట్

భార్య శివానీ, అత్త వందనా మీద కాల్పులు జరిపిన తరువాత జస్వీందర్ సింగ్ బైక్ లో దర్జాగా 30 కిలోమీటర్లు ప్రయాణించి నూర్ మహల్ చేరుకున్నాడు. నూర్ మహల్ లో నివాసం ఉంటున్న శివానీ ప్రియుడు రోహిత్ మీద రివాల్వర్ తో కాల్పులు జరిపి అతన్ని చంపేశాడు. తన భార్యతో రోహిత్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జస్వీందర్ సింగ్ అనుమానం పెంచుకున్నాడని జలంధర్ ఎస్పీ నవీన్ సింగ్లా అన్నారు. ఒకే రోజు భార్య, అత్త మీద కాల్పులు జరిపిన జస్వీందర్ సింగ్ రోహిత్ ను హత్య చేశాడని ఎస్పీ నవీన్ సింగ్లా అన్నారు.

ఉద్యోగానికి వెళ్లకుండా భర్త పక్కాస్కెచ్

ఉద్యోగానికి వెళ్లకుండా భర్త పక్కాస్కెచ్

గత కొంత కాలంగా జస్వీందర్ సింగ్ కాలేజ్ లో విధులకు కూడా హాజరుకాలేదని, తప్పించుకుని పారిపోయిన అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తన భార్య శివానీ రోహిత్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని జస్వీందర్ సింగ్ చాలా కాలంగా రగిలిపోతున్నాడని, అందుకే ఇలా చేశాడని స్థానికులు అంటున్నారు. జస్వీందర్ సింగ్ రివాల్వర్ ఎక్కడి నుంచి తీసుకు వచ్చాడు ? అనే విషయంపై కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+