Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఎన్ఆర్ఐ భర్త ఆస్తుల కోసం లోకల్ ప్రియుడి మోజులో ?, ప్లాన్ మొత్తం రివర్స్ !

బెంగళూరు: ఎన్ఆర్ఐ మొగుడు, లోకల్లో ప్రియుడు, వయసుకు వచ్చిన కొడుకు, ఓ కిలాడీ లేడీ..... అంతే కథ. ఎన్ఆర్ఐ మొగుడితో కాపురం చేస్తున్న మహిళకు వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు. పెళ్లి చెయ్యాల్సిన కొడుకును ఇంట్లో పెట్టుకున్న కిలాడీ లేడీ లోకల్ గా ఓ ప్రియుడిని సెట్ చేసుకునింది. వ్యాపారవేత్త అయిన భర్త భారీగా డబ్బులు సంపాధిస్తుంటే అతని భార్య టిప్పుటాప్ గా రెడీ అవుతూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉన్న ఆమె ప్రియుడి మోజులో పడి ఎవ్వరిని లెక్కచెయ్యలేదు. కొడుకుకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడీ ఆమె ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది. భర్త శవాన్ని హోమంలో వేసి కాల్చిబూడిద చేసిన కిలాడీ లేడి పోలీసులకు ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చేసి బంధువుల ముందు నాటకాలు ఆడింది. వ్యాపారవేత్తను అతని భార్య, ఆమె ప్రియుడు, సొంత కొడుకు హత్య చేశారని కోర్టులో నేరం రుజువు అయ్యింది. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడితో పాటు కొడుకుకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భర్తను చంపేసి ఆయన ఆస్తితో హ్యాపీగా జల్సా చెయ్యాలని స్కెచ్ వేసిన భార్య ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

 బిగ్ షాట్ ఫ్యామిలీ

బిగ్ షాట్ ఫ్యామిలీ

కర్ణాటకలోని ఉడిపికి చెందిన భాస్కర్ శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త. ఉడిపితో పాటు విదేశాల్లో కూడా భాస్కర్ శెట్టిని అనేక హోటల్స్ ఉన్నాయి. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి ఎన్ఆర్ఐ. భాస్కర్ శెట్టికి భార్య రాజేశ్వరి శెట్టి అలియాస్ రాజీ , నవనీత్ శెట్టి అనే కొడుకు ఉన్నాడు. ఉడిపిలో ప్రముఖ జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో చాలా కాలం నుంచి ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 జ్యోతిష్యుడితో ఎన్ఐఆర్ భార్య ఎంజాయ్

జ్యోతిష్యుడితో ఎన్ఐఆర్ భార్య ఎంజాయ్

స్నేహితుడు భాస్కర్ శెట్టి భార్య చూడటానికి ఎర్రగా, బుర్రగా, లావుగా ఉండటంతో ఆమె అందం చూసి తట్టుకోలేకపోయిన జ్యోతిష్యుడు నిరంజన్ భట్ ఆమెకు వలవేశాడు. ఉడిపిలో ఉంటున్న సమయంలో జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో కలిసే నెపంతో రాజేశ్వరి శెట్టి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పగలు లోకల్ ప్రియుడు నిరంజన్ భట్ తో గుట్టుచప్పుడు కాకుండా పడక సుఖం అనుభవించిన ఆమె రాత్రి ఎన్ఆర్ఐ మొగుడు భాస్కర్ శెట్టితో రాజేశ్వరి శెట్టి కాపురం చేసింది.

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడు

భర్త భాస్కర్ శెట్టి వ్యాపారం పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో రాజేశ్వరి ప్రియుడు నిరంజన్ భట్ తో కులకడం మొదలుపెట్టింది. లోకల్ ప్రియుడు నిరంజన్ భట్ వ్యామోహంలో మునిగితేలిన రాజేశ్వరి శెట్టి ఓ సారి జ్యోతిష్యుడితో రాసలీలలు సాగిస్తూ ఆమె భర్త భాస్కర్ శెట్టికి అడ్డంగా చిక్కిపోయింది. భర్త భాస్కర్ శెట్టి వీరలెవల్లో అతని భార్య, జ్యోతిష్యుడు నిరజంన్ భట్ కు వార్నింగ్ ఇవ్వడంతో రాజేశ్వరి శెట్టి, ఆ జ్యోతిష్యుడు రగిలిపోయారు.

 కొడుకుతో కిలాడీ లేడీ చర్చలు..... భర్త ఫినిష్

కొడుకుతో కిలాడీ లేడీ చర్చలు..... భర్త ఫినిష్

మీ నాన్నకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆయన బతికుంటే ఆస్తులు మొత్తం వేరేవాళ్లకు వెళ్లిపోతాయని, తరువాత మన బతుకు బస్టాండ్ అయిపోతుందని రాజేశ్వరి శెట్టి ఆమె కొడుకు నవనీత్ శెట్టికి మాయమాటలు చెప్పింది. 2016 జులై 28వ తేదీ భర్త భాస్కర్ శెట్టిని అతని భార్య రాజేశ్వరి శెట్టి, ఆమె ప్రియుడు నిరంజన్ భట్, కొడుకు నవనీత్ శెట్టి తదితరులు కలిసి అతన్ని దారుణంగా చంపేశారు.

 ప్లాన్ మొత్తం రివర్స్...... అందరూ అందర్

ప్లాన్ మొత్తం రివర్స్...... అందరూ అందర్

భాస్కర్ శెట్టి శవం పోలీసులకు కూడా చిక్కకుండా చెయ్యాలని జ్యోతిష్యుడు నిరంజన్ భట్, భార్య రాజేశ్వరి శెట్టి తదితరులు స్కెచ్ వేశారు. భాస్కర్ శెట్టి శవాన్ని కారులో ప్రియుడు నిరంజన్ శెట్టి ఇంటికి తీసుకెళ్లి హోమంలో వేసి కాల్చి బూడిద చేసేశారు. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి హత్యకు గురికావడం కర్ణాటకతో అప్పట్లో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి హత్య కేసులో అతని భార్య రాజేశ్వరి శెట్టి, ప్రియుడు నిరంజన్ భట్, ఆమె కొడుకు నవనీత్ శెట్టి. జ్యోతిష్యుడు తండ్రి శ్రీనివాస్ భట్, భాస్కర్ శెట్టి కారుడ్రైవర్ రాఘవేంద్రను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 యావజ్జీవ శిక్ష...... హడలిపోయిన కిల్లర్స్

యావజ్జీవ శిక్ష...... హడలిపోయిన కిల్లర్స్

భాస్కర్ శెట్టి హత్య కేసులో నిరంజన్ శెట్టి, నవనీత్ శెట్టి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. రాజేశ్వరి శెట్టి ఆమె భర్త భాస్కర్ శెట్టి ఆస్తులు కొన్ని స్వాధీనం చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. పోలీసుల విచారణలో భాస్కర్ శెట్టిని అతని భార్య రాజశ్వేరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి, జ్యోతిష్యుడు నిరంజన్ భట్ హత్య చేశారని సాక్షాలు చిక్కాయని ఉడిపి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్య 2021 జూన్ 1వ తేదీన చెప్పారు. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టిని అతని భార్య రాజేశ్వరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి, రాజేశ్వరి ప్రియుడు నిరంజన్ భట్ హత్య చేశారని నేరం రుజువు అయ్యిందని, నిందితులకు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి సుబ్రమణ్య సంచలన తీర్పు చెప్పారు.

 ఏదో అనుకున్న కిలాడీ లేడీ చేతికి చిప్ప !

ఏదో అనుకున్న కిలాడీ లేడీ చేతికి చిప్ప !

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తండ్రి శ్రీనివాస్ శెట్టి ఇప్పటికే ఆనారోగ్యంతో మరణించారు. మరో నిందితుడు కారుడ్రైవర్ రాఘవేంద్ర నేరం చేసినట్లు సాక్షం లేదని అతని కేసు నుంచి విముక్తి చేశారు. కోర్టు ఆదేశాలతో యావజ్జీవ శిక్షకు గురైన రాజేశ్వరి శెట్టిని పోలీసులు జైలుకు పంపించారు.

Recommended Video

    India's Greatest Spy Ravindra Kaushik Incredible Story
     మేడమ్ కు 100 శాతం టైమ్ బ్యాడ్

    మేడమ్ కు 100 శాతం టైమ్ బ్యాడ్

    2021 మార్చి నెల 17వ తేదీన ఉడిపిలోని భాస్కర్ శెట్టి హోటల్ లో అతని భార్య రాజేశ్వరి శెట్టి హెటక్ వ్యభిచారం నిర్వహిస్తున్నదని పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ వ్యభిచారం చేస్తున్న వారిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా రాజేశ్వరి శెట్టి తప్పించుకుంది. అయితే ఐదు సంవత్సరాల క్రితం భర్త భాస్కర్ శెట్టిని హత్య చేసిన కేసులో కిలాడీ లేడీ రాజేశ్వరి శెట్టికి యావజ్జీవ శిక్ష పడటంతో ఆమె జీవితాంతం జైల్లో ఉండాల్సి ఉచ్చింది. అయితే జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును రాజేశ్వరి శెట్టి తదితరులు హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాజేశ్వరిశెట్టితో పాటు ఈ కేసులోని నిందితులు అందరూ పై కోర్టును ఆశ్రయించి జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద 2021లో కర్ణాటకలో ఓ ఎన్ఆర్ఐ హత్య కేసులో అతని భార్య, ఆమె ప్రియుడు, కొడుకు జైలుకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+