Illegal affair: మంగళసూత్రం కుదవ పెట్టి భర్తను చంపించింది, కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి !
ముంబాయి/థానే/చెన్నై: సంతోషంగా కాపురం చేస్తున్న దంపతుల మద్య అక్రమ సంబంధాలు చిచ్చు పెట్టాయి. కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న భర్త కరోనా వైరస్ దెబ్బతో క్యాబ్ డ్రైవర్ అయ్యాడు. అప్పటికే పూర్తిగా ప్రియుడి మోజులో పడిపోయిన భార్య విలాసాలకు బానిస అయ్యింది. భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడితో సెటిల్ అయిపోవాలని భార్య డిసైడ్ అయ్యింది. భార్యకు విడాకులు ఇవ్వడానికి భర్త నో చెప్పాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త అతని భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దంగా లేనని పెద్దలకు తేల్చి చెప్పాడు. తన భర్తను ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయిన భార్య ఆమె స్నేహితురాలికి విషయం చెప్పింది. స్నేహితురాలి ద్వారా కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి పరిచయం అయ్యాడు. మంగళసూత్రంతో పాటు కొన్ని బంగారు నగలు కుదువ పెట్టిన భార్య కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డికి ఇచ్చింది. భార్య, ఆమె ప్రియుడు, కాంట్రాక్టు కిల్లర్లు పక్కాప్లాన్ తో భర్తను అతని కారులోనే గొంతు కోసి చంపేశారు. భర్తను చంపించిన భార్య, ఆమె ప్రియుడు, భార్య స్నేహితురాలు, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు కటకటాలపాలైనారు.

దంపతుల హ్యాపీలైఫ్
మహారాష్ట్రలోని థానేలో ప్రభాకర్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాకర్ శృతి గంజి అలియాస్ శృతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వపర్ లూమ్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్ మంచి జీతం సంపాధిస్తూ భార్య శృతితో చక్కగానే కాపురం చేసేవాడు.

భర్తకు అక్రమ సంబంధం, భార్యకు సీక్రేట్ ప్రియుడు
భార్య శృతితో చక్కగానే కాపురం చేస్తున్న ప్రభాకర్ పని చేస్తున్న కంపెనీలో ఓ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంతోషంగా కాపురం చేస్తున్న దంపతుల మద్య భర్త ప్రభాకర్ అక్రమ సంబంధం విషయం చిచ్చు పెట్టింది. తానేమి తక్కువ తినలేదని అనుకున్న భార్య శృతి కూడా గత ఏడాది హితేష్ వాలా అనే యువకుడిని సెట్ చేసుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది.

భార్య జల్సాలు...... భర్త ఉద్యోగం ఊడిపోయింది
ప్రియుడు హితేష్ వాలాతో శృతి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. పవర్ లూమ్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న భర్త ప్రభాకర్ కు కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ఉద్యోగం ఊడిపోయింది. ఇంట్లో భార్య, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీని పోషించడానికి ప్రభాకర్ ఇటీవల సొంతంగా కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా మారిపోయాడు.

ప్రియుడి మోజులో పడిపోయిన భార్య
అప్పటికే పూర్తిగా ప్రియుడి మోజులో పడిపోయిన భార్య శృతి విలాసాలకు బానిస అయ్యింది. చాలిచాలని డబ్బులు సంపాధిస్తున్న భర్త ప్రభాకర్ కు విడాకులు ఇచ్చి ప్రియుడు హితేష్ వాలాతో సెటిల్ అయిపోవాలని భార్య శృతి డిసైడ్ అయ్యింది. భార్య శృతికి విడాకులు ఇవ్వడానికి భర్త ప్రభాకర్ నో చెప్పాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త ప్రభాకర్ అతని భార్య శృతికి విడాకులు ఇవ్వడానికి సిద్దంగా లేనని ఇటీవల పంచాతీలు చేసిన పెద్దల ముందు తేల్చి చెప్పాడు.

భర్త హత్యకు స్నేహితురాలి సలహాలు
విడాకులు ఇవ్వడానికి ప్రభాకర్ మొండికి తిరగడంతో అతని భార్య శృతి రగిలిపోయింది. తన భర్త ప్రభాకర్ ను ఎలాగైనా చంపేయాలని, తరువాత భర్త పేరుతో బ్యాంకులో ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు తనకే వస్తాయని అనుకుంది. భర్తను చంపేయాలని డిసైడ్ అయిన భార్య ఆమె స్నేహితురాలు ప్రియా నికమ్ కు విషయం చెప్పింది. స్నేహితురాలు ప్రియా నికమ్ కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డిని శృతికి పరిచయం చేసింది. భర్త ప్రభాకర్ ను చంపడానికి అతని భార్య శృతి కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డితో డీల్ మాట్లాడుకునింది.

భర్త హత్యకు డబ్బుల కోసం మంగళసూత్రం కుదువ పెట్టిన భార్య
భర్త ప్రభాకర్ ను చంపేయడానికి డబ్బులు అవసరం కావడంతో శృతి ఆమె మంగళసూత్రంతో పాటు కొన్ని బంగారు నగలు కుదువ పెట్టి అందులో రూ. 1 లక్ష రూపాయాలు కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డికి ఇచ్చింది. ప్రభాకర్ హత్యకు సాటి కాంట్రాక్టు కిల్లర్స్ తో కలిసి సంతోష్ రెడ్డి ఓ ప్లాన్ వేశాడు. సంతోష్ రెడ్డి బ్యాచ్ లో శృతి ప్రియుడు హితేష్ వాలా కూడా చేరిపోయాడు.

క్యాబ్ అద్దెకు తీసుకున్న కిల్లర్స్
సంతోష్ రెడ్డి, హితేష్ వాలా, మరో ఇద్దరు ప్రభాకర్ కారును అద్దెకు తీసుకున్నారు. ప్రభాకర్ ను పిలుచుకుని కారులో థానే నుంచి మంకోలి నాకా ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో మేము భోజనం చెయ్యాలని చెప్పడంతో ప్రభాకర్ రోడ్డు పక్కన కారు నిలిపాడు. ఆ సమయంలో సంతోష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు ప్రభాకర్ ను అతని కారులోనే వెనుక నుంచి అతని మెడకు నైలాన్ తాడుతో బిగించి గొంతు కోసి చంపేశారు.

ఒక్కసాక్షం చిక్కలేదు
హత్య చేసిన కాంట్రాక్టు కిల్లర్స్ కారులో ఎలాంటి సాక్షాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుని కారుతో పాటు ప్రభాకర్ శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారులో ప్రభాకర్ శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి అశోక్ హోనేమునే ఆయన టీమ్ తో రంగంలోకి దిగి విచారణ చేశారు. హత్యకు గురైయ్యింది ప్రభాకర్ అని పోలీసులు నిర్దారించుకున్నారు.

టీవీ సీరియల్ ట్విస్ట్ లు చెప్పిన భార్య
ప్రభాకర్ భార్య శృతిని పోలీసులు విచారణ చేశారు. అయితే శృతి పోలీసులకు గంటకు ఒక మాట టీవీ సీరియల్ ట్విస్ట్ లు చెప్పినట్లు సమాధానం చెప్పింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే అప్పుడు భార్య శృతి అసలు స్టోరీ మొత్తం చెప్పింది. తన ప్రియుడు హితేష్ వాలా కోసం తానే కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి తదితరులతో తన భర్తను హత్య చేయించానని కిలాడి భార్య శృతి చెప్పిందని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి అశోక్ మీడియాకు చెప్పారు.

భర్త హత్య కేసులో ఆల్ ఔట్
ప్రభాకర్ హత్య కేసులో అతని భార్య శృతి, ఆమె ప్రియుడు హితేష్ వాలా, కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి, వీరందరు పరిచయం కావడానికి కారణం అయిన శృతి స్నేహితురాలు, సంతోష్ రెడ్డి ప్రియురాలు ప్రియా నికమ్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారి అశోక్ అన్నారు. కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి బ్యాచ్ లోని మరో ఇద్దరు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి అశోక్ చెప్పారు. కాంట్రాక్టు కిల్లర్ సంతోష్ రెడ్డి హైదరాబాద్ కు చెందినవాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications