Wife: భర్తకు కోట్ల ఆస్తి, ప్రియుడితో రెండో భార్య ?, సీసీటీవీల్లో రికార్డు, కొడుక్కి తెలిసినా ?, ఆంటీ కథ క్లోజ్
నోయిడా/ఢిల్లీ: భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తికి, భర్తతో విడాకులు తీసుకున్న మహిళకు పరిచయం అయ్యింది. విడాకులు తీసుకున్న ఇద్దరు రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్తతో కాపురం చేసే సమయంలో పుట్టిన కొడుకు అతని తల్లి దగ్గరే ఉంటున్నాడు. రెండో భర్తతో కాపురం చేస్తున్న మహిళ దగ్గరే ఆమె కొడుకు ఉంటున్నాడు. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న మహిళ రెండో భర్తతో కాపురం చేస్తూనే మరో ప్రియుడిని సెట్ చేసుకుంది. తన తల్లి రెండో పెళ్లి చేసుకున్న తరువాత మరో ప్రియుడితో తిరుగుతోందని తెలిసినా ఆమె కొడుకు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు.
పని ముగించుకుని బైక్ లో వెలుతున్న వ్యక్తి మీద షార్పూ షాటర్స్ కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలు కావడంతో అతను చనిపోయాడు. హత్యకు గురైన వ్యక్తి కేసు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఈ కేసులో హత్యకు గురైన వ్యక్తి రెండో భార్య కొడుకు. రెండో భార్య ప్రియుడిని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. రెండో భార్తను చంపేసి అతని ఆస్తిని స్వాధీనం చేసుకుని ప్రియుడితో జల్సా చెయ్యాలని కిలాడీ లేడీ స్కెచ్ వేసిందని, ఆమెకు కొడుకు కూడా సహకరించాడని వెలుగు చూసింది.

కోట్ల ఆస్తి ఉన్నా సూపర్ వైజర్ గా ఉద్యోగం
నోయిడాలో రిషిపాల్ శర్మా అలియాస్ రిషిపాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రిషిపాల్ మీనూ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన రిషిపాల్, మీనూ దంపతులు తరువాత విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు.

భర్తతో విడాకులు తీసుకున్న ఆంటీ
నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న రిషిపాల్ కు నోయిడాలో, ఢిల్లీ శివార్లలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. నోయిడాలోనే నివాసం ఉంటున్న పూజాసింగ్ కు గతంలో వివాహం అయ్యింది. మొదటి భర్తతో కాపురం చేసిన పూజాసింగ్ కు విశాల్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు.

కిలాడీ లేడీకి రెండో పెళ్లి
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న పూజా సింగ్ ఆమె కొడుకు విశాల్ సింగ్ తో కొంతకాలం జీవించింది. భార్యతో విడాకులు తీసుకున్న రిషిపాల్ కు, భర్తతో విడాకులు తీసుకున్న పూజాసింగ్ కు పరిచయం అయ్యింది. విడాకులు తీసుకున్న రిషిపాల్, పూజాసింగ్ ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్తతో కాపురం చేసే సమయంలో పుట్టిన కొడుకు విశాల్ సింగ్ అతని తల్లి పూజాసింగ్ దగ్గరే ఉంటున్నాడు. రెండో భర్త రిషిపాల్ తో కాపురం చేస్తున్న పూజాసింగ్ దగ్గరే ఆమె కొడుకు ఉంటున్నాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న కిలాడి లేడీ
ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న పూజాసింగ్ రెండో భర్త రిషిపాల్ లో కాపురం చేస్తోంది. ఇదే సమయంలో అఖిల్ అనే వ్యక్తి అతని భార్యను పూజాసింగ్ పని చేస్తున్న ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ సమయంలో పూజాసింగ్, అఖిల్ దగ్గర అయ్యారు. భార్యను ఆసుపత్రి నుంచి ఇంటికి పిలుచుకుని వెళ్లిన తరువాత పూజా సింగ్, అఖిల్ టచ్ లో ఉన్నారు. కొంతకాలం తరువాత పూజాసింగ్, అఖిల్ ను సెట్ చేసుకుంది. తన తల్లి పూజాసింగ్ రెండో పెళ్లి చేసుకున్న తరువాత ప్రియుడు అఖిల్ తో తిరుగుతోందని తెలిసినా ఆమె కొడుకు విశాల్ సింగ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు.

ఆస్తి కోసం రెండో భర్త హత్యకు స్కెచ్
పూజాసింగ్ రెండో భర్త రిషిపాల్ కు నోయిడాలో, ఢిల్లీలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు అమ్మి మనం విలాసవంతమైన జీవితం గడుపుదామని పూజాసింగ్ చాలాసార్లు అతనికి చెప్పింది. అయితే ఆస్తులు అమ్మడానికి రిషిపాల్ నిరాకరించాడు. ప్రియుడు అఖిల్ తో కలిసి రెండో భర్త రిషిపాల్ ను చంపేసి అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని పూజాసింగ్ స్కెచ్ వేసింది.

షార్ప్ షూటర్ ఎంట్రీ
పూజాసింగ్ ప్రియుడు అఖిల్ షార్ప్ షూటర్ మోహంది హాసన్ అనే వ్యక్తిని సంప్రధించి ప్రియురాలు ప్రియా సింగ్ భర్త రిషిపాల్ హత్యకు స్కెచ్ వేశారు. మే 10వ తేదీన రిషిపాల్ పని ముగించుకుని బైక్ లో ఇంటికి బయలుదేరాడు. నోయిడా సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ మీద వెళ్లిన అఖిల్, విశాల్ సింగ్, షార్ప్ షూటర్ మోహంది హాసన్ రివాల్వర్ తో రిషిపాల్ మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన రిషిపాల్ కుప్పకూలిపోయాడు. బుల్లెట్ గాయాలైన రిపిషాల్ ను ఢిల్లీలోని సర్ఫజ్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై రిషిపాల్ చనిపోయాడని నోయిడా డిప్యూటీ పోలీసు కమీషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు.

రెండో భార్య గ్రేట్ ఎస్కేప్
రిషిపాల్ మీద కాల్పులు జరిపిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు హత్యకు గురైన రిషిపాల్ రెండో భార్య ప్రియాసింగ్ ప్రియుడు అఖిల్, ఆమె కొడుకు విశాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. రిషిపాల్ సింగ్ ను తామే హత్య చేశామని నిందితులు అంగీకరించారని నోయిడా డిప్యూటీ పోలీసు కమీషనర్ రణవిజయ్ సింగ్ మీడియాకు చెప్పారు. రెండో భర్త రిషిపాల్ ను చంపించిన అతని రెండో భార్య ప్రియాసింగ్, షార్ప్ షూటర్ మోహంది హాసన్ తప్పించుకుని పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని నోయిడా డిప్యూటీ పోలీసు కమీషనర్ రణవిజయ్ సింగ్ మీడియాకు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications