Illegal affair: భార్య హత్య కేసులో జైల్లో భర్త, ప్రియుడితో కాపురం చేస్తున్న భార్య, థ్రిల్లర్ స్టోరి !

పాట్నా/ పంజాబ్/ బీహార్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. భార్య అప్పుడప్పుడు భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లి వచ్చేది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. కొంతకాలం తరువాత ఇంంటి నుంచి బయటకు వెళ్లిన భార్య మాయం అయిపోయింది. మా కూతురిని అల్లుడు చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను హత్య చేశారని ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు. భార్య హత్య కేసులో అరెస్టు అయిన ఆమె భర్త జైలుల్లో ఉంటున్నాడు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా చనిపోయిందని పోలీసులు చెబుతున్న మహిళ మొబైల్ ఫోన్ గుర్తించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ విభాగం సహాయంతో మహిళ మొబైల్ ఫోన్ నెంబర్ చివరి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. భర్త చేతిలో హత్యకు గురైయ్యింది అనుకుంటున్న మహిళ ఆమె ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 2016లొ పెళ్లి

2016లొ పెళ్లి

జలంధర్ కు చెందిన శాంతిదేవి అలియాస్ శాంతి అనే మహిళకు, లక్ష్మీపూర్ కు చెందిన దినేష్ రామ్ అలియాస్ దినేష్ రామ్ ల వివాహం 2016లో జరిగింది. వివాహం చేసుకున్న శాంతి, దినేష్ దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. భార్య శాంతి అప్పుడప్పుడు భర్త దినేష్ కు చెప్పకుండా బయటకు వెళ్లి వచ్చేది.

 భార్యను చంపేశాడని భర్తను జైల్లో పెట్టారు

భార్యను చంపేశాడని భర్తను జైల్లో పెట్టారు

ఇదే విషయంలో శాంతి, దినేష్ దంపతుల మద్య గొడవలు జరిగాయి. కొంతకాలం తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన శాంతి మాయం అయిపోయింది. మా కూతురు శాంతిని అల్లుడు దినేష్ చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య శాంతిని హత్య చేశాడని ఆమె భర్త దినేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 పోలీసులు ఏం చేశారంటే ?

పోలీసులు ఏం చేశారంటే ?

నా భార్య శాంతి ఎక్కడికి వెళ్లిందో తనకు తెలీదని, నన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా ఆమె ఓ ప్రియుడితో కలిసి తిరుగుతోందని, ఇదే విషయంలో ఇంట్లో గొడవలు కూడా జరిగాయని ఆమె భర్త దినేష్ మొత్తుకున్నాడు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా దినేష్ ను జైలుకు పంపించి చేతులు దులుపుకున్నారు.

 భార్య చివరి ఫోన్ కాల్ డేటా

భార్య చివరి ఫోన్ కాల్ డేటా

భార్య శాంతి హత్య కేసులో అరెస్టు అయిన ఆమె భర్త దినేష్ జైలుల్లో ఉంటున్నాడు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా చనిపోయిందని పోలీసులు చెబుతున్న శాంతి మొబైల్ ఫోన్ గుర్తించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ విభాగం సహాయంతో శాంతి మొబైల్ ఫోన్ నెంబర్ చివరి ఫోన్ కాల్ డేటాను సేకరించారు.

 చనిపోయింది అనుకుంటే ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య

చనిపోయింది అనుకుంటే ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య

భర్త దినేష్ చేతిలో హత్యకు గురైయ్యింది అనుకుంటున్న శాంతి పంజాబ్ లోని జలంధర్ లో ఆమె ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూడటం కలకలం రేపింది. జలంధర్ వెళ్లిన పోలీసులు శాంతిని పట్టుకుని వచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. భార్య శాంతి హత్య కేసులో జైల్లో ఉన్న దినేష్ ను జైలు నుంచి విడుదల చెయ్యడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+