Illegal affair: సిటీలో భర్త, భార్య సీటీమార్, ముగ్గురు పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే?
అహమ్మదాబాద్/గుజరాత్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పని చెయ్యడానికి భర్త సిటీకి వెళ్లాడు. వీలు చిక్కినప్పుడు ఊరికి వెలుతున్న భర్త అతని భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. భర్త బయట ఉండటంతో భార్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. చాలాకాలం నుంచి భార్య అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.
భర్తకు భార్య అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసి అతని భార్య చర్మం చేతికి వచ్చేలా చితకబాదేశాడు. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని భర్త అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త సిటీకి వెళ్లిన తరువాత ముగ్గురు పిల్లలను పిలుచుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లింది. ప్రియుడి సహాయంతో ముగ్గురు పిల్లలను నదీ కాలువలో తోసి హత్య చేసిన మహిళ ఆమె ప్రియుడితో కలిసి మాయం అయ్యింది.

ముగ్గురు పిల్లలు
గుజరాత్ లోని దేథాలి ప్రాంతంలో ఈశ్వర్ బెన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈశ్వర్ పెద్దలు సెట్ చేసిన ముక్తాబెన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈశ్వర్ ను వివాహం చేసుకున్న ముక్తాబెన్ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. ఈశ్వర్, ముక్తాబెన్ దంపతులకు ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
ఈశ్వర్ మేస్త్రీ పని చెయ్యడానికి అహమ్మదాబాద్ సిటీకి వెళ్లాడు. వీలు చిక్కినప్పుడు ఊరికి వెలుతున్న ఈశ్వర్ అతని భార్య ముక్తాబెన్, పిల్లలతో కలిసి సంతోష:గా ఉంటున్నాడు. భర్త అహమ్మదాబాద్ లో ఉండటంతో అతని భార్య ముక్తాబెన్ ధారధార గ్రామంలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది.

చంపేస్తానని భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త
చాలాకాలం నుంచి ముక్తాబెన్ అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే గ్రామస్తులకు ముక్తాబెన్ అసలు మ్యాటర్ తెలిసిపోయి అహమ్మదాబాద్ లో ఉంటున్న ఆమె భర్త ఈశ్వరకు సమాచారం ఇచ్చారు. మ్యాటర్ తెలుసుకున్న ఈశ్వర్ అతని భార్య ముక్తాబెన్ ను ఆమె చర్మం చేతికి వచ్చేలా చితకబాదేశాడు. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని ఈశ్వర్ అతని భార్య ముక్తాబెన్ కు వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియుడితో కలిసి పిల్లలను నదిలో తోసి హత్య చేసిన తల్లి
ఈశ్వర్ అహమ్మదాబాద్ సిటీకి వెళ్లిన తరువాత ముక్తాబెన్ ఆమె ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుసటి రోజు ముక్తాబెన్ ముగ్గురు పిల్లలను పిలుచుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లింది. ప్రియుడి సహాయంతో ముగ్గురు పిల్లలను నర్మదా నదీ కెనాల్ లో తోసిన ముక్తాబెన్ వాళ్లు నీళ్లలో మునిగిపోయే వరకు అక్కడే ఉంది.

ఆత్మహత్య చేసుకుందా ?, ప్రియుడితో పారిపోయిందా
ముగ్గురు పిల్లలను హత్య చేసిన ముక్తాబెన్ తరువాత ఆమె మొబైల్ ఫోన్ నదీకాలువ గట్టుమీద పెట్టి ఆమె ప్రియుడితో కలిసి మాయం అయ్యింది. ఆ ప్రాంతం మాజీ సర్పంచ్ మాఘాజీ పటేల్ పిల్లలు శవాలు నది కాలువలో తేలుకున్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు పిల్లల శవాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పిల్లలను నదీ కాలువలో తోసేసి హత్య చేసిన ముక్తాబెన్ ప్రియుడితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముక్తాబెన్ శవం కోసం నదిలో అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications