Illegal affair: భార్య సూపర్ ఫిగర్, కైమా చేసి కాకులకు వేశాడు, నాలుగు నెలలకు !

బెంగళూరు/మైసూరు/మండ్య: అందమైన భార్యతో కాపురం చేస్తున్న భర్తకు రానురాను ఆమె మీద అనుమానం పెరిగింది. తనకంటే భార్య చాల అందంగా తయారౌతుందని, ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెంచుకుందని రోజురోజుకు అనుమానం పెంచుకుని గొడవలు చేసేవాడు. మంచి రోజు చూసి బావతో కలిసి కట్టుకున్న భార్యను నమ్మించి పిలుచుకుని వెళ్లి ముక్కలు ముక్కలుగా నరికేసి కైమా చేశాడు. శవం చిక్కితే జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో నదిలో భార్య శరీరం ముక్కలు కాకులకు విసిరేసినట్లు విసిరేశాడు.

అందమైన భార్య

అందమైన భార్య

కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలుకా దేశవళ్ళిలో రంగప్ప, ఆశా (28) దంపతులు నివాసం ఉంటున్నారు. రంగప్ప, ఆశా దంపతులు చక్కగా కాపురం చెయ్యడంతో వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలతో కలిసి ఆశా చాలా సంతోషంగా గడిపింది. చాలా సంతోషంగా ఉన్న ఆశా జీవితంలో కదుపులు మొదలైనాయి.

అనుమానం పిచాచి

అనుమానం పిచాచి

రంగప్ప చూడటానికి నల్లగా ఉంటాడు. ఆశా చూడటానికి తెల్లగా చాలా స్లిమ్ గా అందంగా ఉంటుంది. తనకంటే భార్య అందంగా ఉండటం రంగప్పకు నచ్చలేదు. తన భార్య ఆశాకు ఎవరితోనో అక్రమ సంభంధం ఉందని, అందుకే రోజు టిప్పుటాప్ గా రెడీ అవుతోందని రంగప్ప పూర్తిగా అనుమానం పెంచుకున్నాడు.

ఎవడు వాడు... ఎంతకాలం ?

ఎవడు వాడు... ఎంతకాలం ?


నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తరువాత ఎవరితో నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటూ రంగప్ప అతని భార్య ఆశాతో రోజురోజుకు గొడవలు పడటం మొదలుపెట్టాడు. చాలాకాలం రంగప్ప, ఆశా దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అప్పుడే తన భార్య ఆశాను చంపేయాలని రంగప్ప స్కెచ్ వేశాడు.

భార్యను కైమా చేశాడు

భార్యను కైమా చేశాడు

నాలుగు నెలల క్రితం భార్య ఆశాను నమ్మించిన రంగప్ప ఆమెను నిర్జన ప్రదేశంలోకి పిలుచుకని వెళ్లాడు. అక్కడికి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం బావ చంద్రను పిలిపించుకున్న రంగప్ప భార్య ఆశాను కట్టేశాడు. కొడవలి తీసుకున్న రంగప్ప భార్య ఆశాను పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. భార్య ఆశాను కైమా చేసిన రంగప్ప ఆమె మీద పగ తీర్చుకున్నాడు.

కాకులకు వేసినట్లు నదిలో వేసేశాడు

కాకులకు వేసినట్లు నదిలో వేసేశాడు


భార్య ఆశా శరీరం ముక్కలు ముక్కలు చేసి వాటిని హేమావతి నదిలో విసిరేసిన రంగప్ప, అతని బావ చంద్ర చేతులు దులుపేసుకున్నారు. ఆశా కనపడకపోవడంతో ఆమె తండ్రి గౌరీ శంకర్ కు అనుమానం పెరిగిపోయి పాండవపుర పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. ఇదే సమయంలో హేమావతి నదిలో మహిళ శరీరంలోని ముక్కలు గుర్తించిన కృష్ణరాజపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమ సంబంధం... అందుకే చంపేశాను

అక్రమ సంబంధం... అందుకే చంపేశాను

హేమావతి నదిలో చిక్కిన మహిళ శరీరం ముక్కలు తన కూతురివే అని గౌరీ శంకర్ పోలీసులకు చెప్పాడు. నాలుగు నెలల నుంచి కేసు నుంచి తప్పించుకుని తిరుగుతున్న భర్త రంగప్పను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే తన భార్య ఆశాను తాను కిరాతకంగా చంపేశానని రంగప్ప అంగీకరించాడని పాండవపుర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+