ఆంటీ అక్రమ సంబంధానికి కాలేజ్ అబ్బాయి బలి, రోడ్లో అందరి ముందు పొడిచిన ప్రియుడు !
చెన్నై/ టీ నగర్: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మహిళ భర్త పచ్చి తాగుబోతు. మహిళ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. అదే కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. మహిళ అక్రమ సంబంధం విషయంలో జరిగిన గొడవలో ఇంటర్ చదువుతున్న మహిళ కొడుకు ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైనాడు.
చెన్నైలోని విరుగంబాక్కం తంగల్‌లోని ఏరికరై స్ట్రీట్ లో ఇళంచెజియన్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇళంచెజియన్ ప్లంబర్ గా పని చేస్తున్నాడు. కొన్ని ఏళ్లక్రితం ధనలక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇళంచెజియన్, ధనలక్ష్మి దంపతులకు మదన్ కుమార్ (17), జీవా అనే కుమారులు ఉన్నారు. మదన్ కుమార్ వేలచ్చేరిలోని ప్రభుత్వ కాలేజ్ లో 11వ తరగతి (ఇంటర్) చదువుతున్నాడు.

ధనలక్ష్మి పులియంతోపులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మద్యానికి బానిసైన ఇళంచెజియన్ తన భార్య ధనలక్ష్మితో రోజూ గొడవపడేవాడు. ధనలక్ష్మి తన సహోద్యోగి కార్తీక్ (32)తో పరిచయం పెంచుకుంది. తన భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని ధనలక్ష్మి ఆమె స్నేహితుడు కార్తీక్ చెప్పి విలపించేది. ఆ సమయంలో కార్తీక్ ధనలక్ష్మికి ఓదార్పుతూ దగ్గరకు తీసుకునేవాడు.
మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో ధనలక్ష్మి భర్త ఇళంచెరియన్ ను చేర్చడానికి కార్తీక్ సహాయం చేశాడు. చివరికి ధనలక్ష్మి, కార్తీక్ ల మధ్య ఉన్న స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. గత 5 ఏళ్లుగా వేలచ్చేరిలో ధనలక్ష్మి, కార్తీక్ సహజీవనం చేస్తున్నారు. ధనలక్ష్మి భర్త ఐదు సంవత్సరాల నుంచి మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలోనే ఉండిపోయాడు.

ఇటీవల కార్తీక్, ధనలక్ష్మిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ధనలక్ష్మి కార్తీక్‌తో విడిపోయింది. భర్త ఇళంచెజియన్ కోలుకుని మద్యం పూర్తిగా మానేసి బాయటకు రావడంతో ధనలక్ష్మి ఆమె భర్త, కుమారుడు జీవాతో పాటు విరుగంబాక్కంలో నివసిస్తోంది. ప్రియురాలు ధనలక్ష్మి భర్తతో కలిసి వెళ్లడంతో రగలిపోయిన కార్తీక్ ఎలాగైనా ప్రియురాలిని తన దగ్గరకు రప్పించుకోవాలని ప్రయత్నించాడు.
ఈనెల 7వ తేదీన విరుగంబాక్కంలోని ఇళంచెజియన్ ఇంటికి వెళ్లిన కార్తీక్ తనతో పాటు రావాలని అతని మాజీ ప్రియురాలు ధనలక్ష్మికి చెప్పాడు. ఆ సమయంలో ధనలక్ష్మి కుమారుడు మదన్‌కుమార్, కార్తీక్ ల మధ్య వాగ్వాదం జరగింది. ఒక్కసారిగా రగిలిపోయిన కార్తీక్ అతని వెంట తీసుకెళ్లిన కత్తితో మదన్‌కుమార్ కడుపు, చేతిపై ఇష్టం వచ్చినట్లు పొడిచి పారిపోయాడు.

తీవ్రంగా గాయపడిన మదన్ కుమార్‌ను చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈలోపు ఇళంచెజియన్ ఇంటి వద్ద వదిలి వెళ్లిన బైక్ తీసుకోవడానికి వెళ్లిన కార్తీక్‌ను పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాది చెన్నై పోలీసులకు అప్పగించారు. పోలీసులు కార్తీక్ ను బెండ్ తీశారు.
ప్రియురాలు ధనలక్ష్మి తనతో విడిపోవడానికి ఆమె కొడుకు మదన్ కుమార్ కారణమని ఆగ్రహించిన కార్తీక్ అతన్ని కత్తితో పొడిచాడని పోలీసులు అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మదన్ కుమార్ బుధవారం రాత్రి చికిత్స విఫలమై మృతి చెందాడు. అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైలుకెళ్లిన కార్తీక్ పై హత్య కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. తల్లి ధనలక్ష్మి అక్రమ సంబంధానికి ఆమె కుమారుడు మదన్ కుమార్ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications