అక్రమ సంబంధం: కొడుకు ఎదుటే భార్య హత్య

మధురై: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకు ఎదుటే భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. వేరొకరితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్యను కొడవలితో నరికేశాడు. తమిళనాడులోని మరవాపట్టికి చెందిన పెరియాస్వామి (42), సీలైక్కరి (37) దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే సీలైక్కరికి వేరొక వ్యక్తితో సంబంధం ఉందంటూ పెరియాస్వామి తరుచూ కొడుతుండేవాడు. ఈ పరిస్థితిలో గత మంగళవారం ఐదో తరగతి చదువుతున్న కొడుకు నాగేంద్రతో కలిసి సీలైక్కరి పశువులను మేపడానికి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి పడుకుంది.

Illicit love affair turns costly; Husband beheads wife in front of son

అకస్మాత్తుగా పెరియాస్వామి పెద్దగా అరుచుకుంటూ లోపలికి వచ్చి ఆమెను కొట్టడం మొదలెట్టాడు. కొడుకు విడిపించేందుకు ప్రయత్నించగా అతణ్ని కూడా కొట్టి పక్కకు విసిరేశాడు. ఆ సమయంలో సిలైక్కరి పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో పక్కనే ఉన్న కొడవలి తీసి అమె తలను నరికేశాడు.

దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాగా, పెరియాస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పిల్లలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. కుమారుడు తండ్రి సెల్ ఫోన్ తీసుకుని ఆడుకుంటున్న సమయంలో అతను భార్య తల నరికేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+