వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై కోర్టు నుంచి పారిపోయిన ఉస్మానీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై కోర్టు నుంచి పారిపోయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానీని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బలగాల పోలీసులు అరెస్టు చేశారు. ముంబై కోర్టు నుంచి ఉస్మానీ సెప్టెంబర్ 20వ తేదీన పారిపోయిన విషయం తెలిసిందే. గోవాలో పోలీసులు సోమవారంనాడు అతన్ని అరెస్టు చేశారు.

సూరత్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో నిందితుడైన ఉస్మానీ టాయ్‌లెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. రాయగఢ్ జిల్లాలోని తలోజా కేంద్ర కారాగారం నుంచి మోకా కేసులో విచారణ కోసం కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు అతను తప్పించుకున్నాడు.

Afzal Usmani

ఉగ్రవాద కార్యకలాపాలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని సంగార్పూర్ గ్రామానికి చెందిన ఉస్మానీ (38) ముంబైలో హోటల్ నడిపేవాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఆర్థిక వ్యవహారాలను చూస్తుండేవాడని అంటారు. ఉస్మానీ పారిపోయిన తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఏడుగురు సిమీ కార్యకర్తలు కూడా పారిపోయారు.

తాజా కేసులో భత్కల్ అరెస్టు

ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను, అతని సహచరుడు అసదుల్లా అక్తర్ కోర్టు 15 రోజుల పాటు ఢిల్లీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఆయుధ కర్మాగారాన్ని నెలకొల్పిన కేసులో వారిద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Indian Mujahideen terrorist Afzal Usmani, who had escaped from a Mumbai court on September 20, was arrested by the Anti-Terrorism Squad (ATS) of Maharashtra Police from Goa on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X