• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైలు శిక్షా.. జరిమానా... ప్రశాంత్ భూషణ్ 'కోర్టు ధిక్కార' కేసులో నేడే సుప్రీం తీర్పు...

|

దాదాపుగా గత నెల రోజులుగా ప్రశాంత్ భూషణ్ కేసుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయవ్యవస్థను ఆయన ధిక్కరించారని సుప్రీం కోర్టు చెబుతుండగా... పలువురు మేదావులు,ప్రజాస్వామిక వాదులు,లా స్టూడెంట్స్ ప్రశాంత్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం విమర్శలకు అతీతంగా వ్యవహరించకూడదని.. సంకుచిత ధోరణి సబబు కాదని పలువురు సూచించారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం భూషణ్‌ను దోషిగానే తేల్చింది. ఈ కేసులో సోమవారం(అగస్టు 31) తీర్పును వెల్లడించనుంది. దీంతో ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ఏ శిక్ష విధిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

క్షమాపణలకు ఒప్పుకోని భూషణ్...

క్షమాపణలకు ఒప్పుకోని భూషణ్...

జస్టిస్ అరుణ్ మిశ్రా నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార కేసుపై నేడు తీర్పు వెలువరించనుంది. కోర్టు ధిక్కార చట్టం కింద భూషణ్‌కు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2వేలు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు కలిపి విధించే అవకాశం ఉంది. ఈ కేసులో అగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. క్షమాపణ గడువు కూడా ఇచ్చినప్పటికీ ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గలేదు. అలా చేస్తే తప్పును అంగీకరించినట్లవుతుందని,అందుకు తన మనస్సాక్షి ఒప్పుకోదని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 25న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

క్షమించి వదిలేయాలన్న అటార్నీ జనరల్...

క్షమించి వదిలేయాలన్న అటార్నీ జనరల్...

ఈ కేసులో ప్రశాంత్ భూషణ్‌కు ఎలాంటి శిక్ష విధించవద్దని,పెద్ద మనసుతో క్షమించి వదిలేయాలని అగస్టు 20న అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సైతం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో బెంచ్ ఆయనకు సోమవారం (అగస్టు 24) వరకు క్షమాపణలు చెప్పేందుకు గడువు ఇచ్చింది. ప్రశాంత్ భూషణ్ తన ధిక్కార వ్యాఖ్యలను సమీక్షించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. తప్పులు అందరూ చేస్తారని... కానీ వాటిని ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కానీ ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ అందుకు సిద్దంగా లేడని చెప్పుకొచ్చింది. భూషణ్ కూడా క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించడంతో ఆయనకు శిక్ష విధించేందుకు కోర్టు సిద్దమైంది.

న్యాయ విద్యార్థుల మద్దతు...

న్యాయ విద్యార్థుల మద్దతు...

భూషణ్‌పై కేసులో తీర్పుకు ఒక్కరోజు ముందు 122 మంది విద్యార్థులు సీజేఐ, ఇతర న్యాయమూర్తులకు లేఖలు రాశారు. తీర్పును పున:పరిశీలించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా న్యాయ వ్యవస్థ విమర్శలకు బదులివ్వాలని పేర్కొన్నారు. అంతేకానీ, న్యాయం పట్ల ప్రేమ,తపన ఉన్నవారి నుంచి న్యాయ వ్యవస్థపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని కోర్టు ధిక్కారం కింద చూడకూడదన్నారు.

  Final-Year Exams To Be Held, Can't Promote Students Without It - Supreme Court || Oneindia Telugu
  అసలు ప్రశాంత్ భూషణ్ ఏమన్నారు...

  అసలు ప్రశాంత్ భూషణ్ ఏమన్నారు...

  ప్రశాంత్ భూషణ్ జూన్ 27న చేసిన రెండు ట్వీట్లు కోర్టు ధిక్కారానికి కారణమయ్యాయి. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే ఇందుకు బాధ్యులని భూషణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్‌ ధరించకుండా నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఓ బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్‌ని నడుపుతున్నారని, లాక్‌డౌన్‌ పేరుతో జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్‌ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్లను న్యాయ వ్యవస్థపై దాడిగా పరిగణించిన న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది.

  English summary
  The Supreme Court is scheduled to pronounce on Monday its verdict on the quantum of sentence to be awarded to activist-lawyer Prashant Bhushan, convicted for contempt of court over his two tweets against the judiciary.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X