నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్‌కు మాత్రం దూరం : పాకిస్థాన్‌పై ఇండియా న్యూ స్ట్రాటజీ
న్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం
జాతీయ దినోత్సవం సందర్భంగా దేశంలో శాంతి నెలకొల్పేందుకు పాటుపడాలని, సరిహద్దు దేశాలైన భారత్, పాకిస్థాన్ కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేసినట్టు ఇమ్రాన్ ఫేర్కొన్నారు. ఇరుదేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ, అభివృద్ధి సాధించాలని.. దీంతోపాటు ప్రాంతీయ అసమానతలను పారదోలి, హింసాత్మక పరిస్థితుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరినట్టు ఇమ్రాన్ తెలిపారు.

గంటల్లోనే మారిన వైఖరి ..
మోదీ ట్వీట్ కు ఇమ్రాన్ ఖాన్ రీ ట్వీట్ చేశాక .. కొన్ని గంటల్లో ఢిల్లీ పాకిస్థాన్ హై కమిషన్ ఏర్పాటుచేసిన జాతీయ దినోత్సవ వేడుకకు భారత్ హాజరుకాలేదు.. దీనిపై వివరణ కోరితే .. ఇస్లామాబాద్ లో జరిగే వేడుకలకు భారత్ తరఫున ప్రతినిధి హాజరవుతారని తెలిపింది.












Click it and Unblock the Notifications