వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన ఘటన-యోగీ ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ నవ్వుకుంటూ షేక్ హ్యాండ్-ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

తాజాగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం విమర్శల జడివాన కురిపించుకున్న యోగీ ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ ఇవాళ చేతులు కలుపుకున్నారు. అసెంబ్లీలో పరస్పరం ఎదురుపడి నవ్వుకోవడమే కాకుండా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేలు ఈ దృశ్యాల్ని ఆసక్తిగా గమనించారు.

ఇవాళ యూపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగింది. 403 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా సుదీర్ఘంగా సాగింది. ఇందులో భాగంగా తొలుత సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు విపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్న యోగీ.. విపక్షనేత అఖిలేష్ ప్రమాణం పూర్తి కాగానే ఆయన వద్దకు వెళ్లి అభినందించి చేతులు కలిపారు. ఎన్నికల్లో పరస్పరం తీవ్రంగా దూషించుకున్న వీరిద్దరూ ఇలా చేతులు కలుపుకోవడం చూసి పలువురు నేతలు అవాక్కయ్యారు.

 in a rare guesture in up assembly, Yogi Adityanath, Akhilesh Yadav smile and shake hands

అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రి సభ్యులతో ప్రమాణం చేయించారు. అఖిలేష్ యాదవ్ యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి గెలుపొందగా, యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 273 సీట్లతో మెజారిటీ సాధించాయి. 403 స్థానాలున్న అసెంబ్లీలో ఎస్పీ 111 స్థానాల్లో విజయం సాధించింది.

English summary
in a rare incident, cm yogi adityanath and opposition leader akhilesh yadav have smile and shaken hands in up assembly today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X