చరిత్రలో తొలిసారిగా.. హైకోర్టు సిట్టింగ్ జడ్జికి కోర్టు ధిక్కార నోటీసు
కోల్ కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జి సీఎస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈనెల 13న కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ని ఆదేశించింది.
ఢిల్లీ: ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి తొలిసారి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతోపాటు మద్రాస్ హైకోర్టు జడ్జీలపై అవినీతి ఆరోపణలు గుప్పించిన కోల్ కతా హైకోర్టు జడ్డి సీఎస్ కర్ణన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మధ్యే పలువురు మాజీ, ప్రస్తుత జడ్జీలపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎస్ కర్ణన్. దీనిని సుమోటోగా స్వీకరించింది సుప్రీం ధర్మాసనం. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ సహా ఏడుగురు సీనియర్ జడ్జీల ధర్మాసనం ఈ ధిక్కరణ కేసులపై విచారణ జరుపుతోంది.
కర్ణన్ కు నోటీసు జారీ చేయడంతోపాటు ఆయనకు ఎలాంటి న్యాయ, పాలనాపరమైన పని అప్పగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న కోర్టు ముందు హాజరు కావాలని కర్ణన్ ను ఆదేశించింది.

అలాగే ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ దస్త్రాలను కోల్ కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు అందజేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల కాపీని జస్టిస్ కర్ణన్ కు పంపించాలని కూడా కోర్టు రిజిస్ట్రార్ ను కోరింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఏ సిట్టింగ్ జడ్జికి కూడా ఇలా కోర్టు ధిక్కార నోటీసు జారీ అవలేదు.
ఇతర జడ్జీలపై ఆరోపణలు చేస్తూ ప్రధానికి లేఖ రాసిన కర్ణన్ పై చర్యలు తీసుకొని సుప్రీంకోర్టు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని బుధవారం విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. గతంలోనూ కర్ణన్ వివాదాల్లో చిక్కుకున్నారు.
సుప్రీం కొలీజియం ఆయన్ని మద్రాస్ హైకోర్టు నుంచి కోల్ కతా హైకోర్టుకు బదిలీ చేసినా.. ఆ ఆదేశాలను కర్ణన్ పట్టించుకోలేదు. అయితే తరువాత క్షమాపణ చెప్పారు. ఆయన మద్రాస్ హైకోర్టు నుంచి వెళ్లిపోయినా.. ప్రభుత్వ వసతి గృహాన్ని మాత్రం ఖాళీ చేయలేదంటూ ఆ హైకోర్టు సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా వేసింది.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications