తొలి కేసు: మైనర్ బాలుడిపై పలుమార్లు యువతి రేప్, వీడియో తీసి బెదిరింపు
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆకృత్యాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మైనర్ బాలుడి(16)పై 23ఏళ్ల యువతి అత్యాచారానికి పాల్పడింది. అంతేగాక, ఆ అఘాయిత్యాన్ని వీడియో తీసి తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు గురిచేసింది.
కాగా, సహరాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సహరాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉండగా, బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోస్కో) సెక్షన్ 7,8 లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద నిందితురాలైన మహిళపై ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు పెట్టారు.మైనర్ బాలుడిపై మహిళ అత్యాచారం జరిపిన ఘటనను వీడియో తీసి, దాన్ని బయటపెడతానని బెదిరించి బాలుడిని పలుసార్లు లైంగికంగా వేధించిందని పోలీసులు చెప్పారు.

తనను పెళ్లి చేసుకోకుంటే తనతో గడిపిన వీడియో క్లిప్పింగును ఆన్‌లైన్లో పెడతానని నిందిత మహిళ మైనర్ బాలుడిని బెదిరించిందని పోలీసులు తెలిపారు. ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నిందితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్పూర్ స్టేషన్ ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు.
కాగా, మైనర్ బాలుడితో మహిళకు ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి చేసుకోవాలని బాలుడిపై మహిళ ఒత్తిడి తీసుకువస్తే అతను తిరస్కరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దీక్షిత్ తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications