10వేల రివార్డ్: కిలో మీటరు పరుగెత్తి.. చైన్ స్నాచర్‌ను పట్టేసింది

హరిద్వార్ నగరంలో ప్రైవేటు ట్యూషన్లు చెప్పుకొనే నిర్మలా పండిట్ తన బంధువుల ఇంటికి ఇండోర్ వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అందరు మహిళల్లా భయపడిపోకుండా.. అతడి వెంటపడింది. సుమారు కిలో మీటరు వరకు అతడ్ని వెంబడించి పట్టుకుంది. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించింది. గొలుసు విలువ రూ. 40వేలు అని నిర్మలా పండిట్ తెలిపింది.
‘నేను బంధువుల ఇంటి నుంచి బయటికి వచ్చి.. సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నాను. నా వెనక నుంచి వచ్చిన వ్యక్తి నా మెడలోని గొలుసును పట్టుకుని పారిపోయాడు. అతడ్ని నేను వెంబడించా. ఎవరూ నాకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఓ వ్యక్తి చైన్ స్నాచర్‌పై రాయి విసిరాడు. చైన్ పడేసిన అతడు మళ్లీ పరుగెత్తగా.. అతడ్ని పట్టుకున్నా' అని నిర్మలా పండిట్ చెప్పారు.
కాగా, ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు, ఆమెకు రూ. 10వేల రివార్డు ఇచ్చి సత్కరించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ఆమె ఎంతో ధైర్యసాహాసాలు ప్రదర్శించారని కొనియాడారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications