కర్నాటక ఎన్నికలు: ధనిక అభ్యర్థి ఆస్తి రూ.1020 కోట్ల, పేద అభ్యర్థి ఆస్తి రూ.1000
బెంగళూరు: ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 883 మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు. మొత్తం 2560 మంది పోటీ చేస్తున్నారు.
బీజేపీ నుంచి 224 మంది పోటీ చేస్తుండగా 208 (93%) మంది, 220 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 207 (94%) మంది, 199 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 154 (77%), 25 మంది జేడీయూ అభ్యర్థుల్లో 13(52%) మంది, 27 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 9 (33%) మంది, మిగతా వారిలో 1090 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 199 (18%) మంది కోటీశ్వరులు.

అత్యధికంగా ఆస్తులున్నవారిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులే. గోవిందరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న ప్రియాకృష్ణ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. అతని ఆస్తి రూ.10,20,53,87,250. అందరికంటే తక్కువగా ఆస్తి ఉన్న అభ్యర్థి బొమ్మనహళ్లి నుంచి పోటీ చేస్తున్న దిలీప్ కుమార్. ఇతనికి స్థిరస్తులు ఏమీ లేవు. చరాస్తులు రూ.1000. ఇతని మొత్తం ఆస్తి రూ.1000.
తనకూ యడ్యూరప్పకు మధ్య ఉన్న పోటీని తనకూ ప్రధాని మోడీకి మధ్య పోటీగా మార్చారని సీఎం సిద్ధారామయ్య అన్నారు. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. హంగ్ వచ్చే సమస్యే లేదన్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదా కట్టబెట్టే అంశం ప్రస్తుతం కర్ణాటక పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందన్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications