సముద్రంలా చెన్నై సిటీ: రెస్క్యూ ఆపరేషన్ (పిక్చర్స్)
చెన్నై: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అతలాకుతలం అవుతోంది. తమిళనాడు రాజధాని చెన్నై నగరం పూర్తిగా నీట మునిగింది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) రంగంలోకి దిగింది. వారు సహాయక చర్యలు చేపడుతున్నారు.
సహాయక చర్యల్లో ఎంఐ17వి5ఎస్, 2ఏఎల్‌హెచ్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. సోమవారం చిన్నారులు సహా 22 మందిని రక్షించినట్లు చెప్పారు. ఆహారం, నీరు హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు.
చెన్నై సముద్రాన్ని తలపిస్తోంది.. ఇళ్లు మడుగులయ్యాయి. బస్సులు సహా వాహనాలు ముగిపోయాయి. ఇంటా, బయట ఉండలేక చెన్నై వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వంటా వార్పు లేదు. కొన్ని ప్రాంతాల్లో తిండి దొరికి రెండు మూడు రోజులైంది.
ఏవైనా కొనుక్కుందామా అంటే అగచాట్లు తప్ప ఎక్కడా అంగళ్లు లేవు. ఒకచోట నుంచి మరో చోటకు కదల్లేని పరిస్థితి. చెన్నైలొ భారీ వర్షాల వల్ల మోకాలిలోతు నీరు చేరగా.. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ వరద మరింత పెరిగింది.

చెన్నై
చెన్నైలోని ఎంకేబీనగర్, అడయారు, కొరట్టూరు, కొలత్తూరు ప్రాంతాల్లో వేలాది గుడిసెలు మునిగిపోయాయి. వేలచ్చేరి లాంటి ప్రాంతాల్లో వీధులు, గృహాలన్నీ వరదనీటితో నిండిపోయాయి.

చెన్నై
నగరవ్యాప్తంగా చాలా వరకు ఇళ్లలో కింది అంతస్తులో ఉండలేని దుస్థితి. చెన్నైకి 25 కి.మీ. దూరంలోని చెంబరంబాక్కం చెరువులో నీరు గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

చెన్నై
ఈ జలాశయం నుంచి మిగులు జలాలను వదిలేయడంతో కుండ్రత్తూరు, వడుతలమేడు, పాలవాక్కంతోపాటు 10కి పైగా ముఖ్యమైన ప్రాంతాలు నీట మునిగాయి.

చెన్నై
వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే ఈ జలాశయానికి గండిపడే అవకాశముందని, ఆ నీరు కూవం నది ద్వారా చెన్నై నగరంలోకి వచ్చే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చెన్నై
ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా మృతి చెందారని తెలుస్తోంది. చెన్నైలోని పది సబ్‌వేల్లో ప్రభుత్వ బస్సులు మునిగిపోవడంతో అందులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

చెన్నై
ఎక్కడి బస్సులు అక్కడే నీట్లో ఉన్నాయి. కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, కన్యాకుమారితోపాటు పలు జిల్లాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కాంచీపురం జిల్లాలో మూడు ప్రధాన జలాశయాలు నిండిపోవడంతో 25 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రామేశ్వరంలో వేలాది గృహాలు నీటమునిగాయి.

చెన్నై
తమిళనాడు, పుదుచ్చేరిల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ వరద పోటెత్తడంతో వంద వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెన్నైలో భారత వాయుసేనకు చెందిన దళాలు అందర్నీ రక్షిస్తోంది. 400 మందితో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ దళాలు తమిళనాడులో సహాయక చర్యలు చేపట్టాయి.

చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సొంత నియోజకవర్గమైన చెన్నైలోని ఆర్కే నగర్‌లో సోమవారం పర్యటించారు. ఆమె వాహనంలో కూర్చుని వరదబాధిత ప్రజలను పరామర్శించారు. సహాయ చర్యల కోసం రూ.500 కోట్లు విడుదల చేశారు.

చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత... చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
-
AP Weather: ఏపీలో వచ్చే రెండ్రోజులు అటు ఎండలు- ఇటు వర్షాలు..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications