వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: డెహ్రడూన్ బిజెపి ఆపీసులోనే వ్యాపారి సూసైడ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తన జీవితాన్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేసిందంటూ బిజెపి కార్యాలయంలో విషం తాగిన వ్యక్తి మంగళవారం చనిపోయాడు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకొంది.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానికి చెందిన ప్రకాష్ పాండే గత శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్లి అక్కడే విషం తీసుకున్నాడు. దీంతో అక్కడి కార్యకర్తలకు అతన్ని ఒక మంత్రి కారులో డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.

In Suicide Blaming GST At BJP Office, Uttarakhand Government's First Crisis

చికిత్స పొందుతూనే ప్రకాష్ పాండే ఇవాళ కన్నుమూశాడు. చనిపోవాలనే నిర్ణయానికి రావడానికి ముందు నోట్‌బందీ, జీఎస్‌టీ కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానంటూ ప్రకాష్ పాండే చెప్పేవాడని, తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వ్యవసాయ శాఖ మంత్రి సుబోధ్ యునియల్ శనివారం నిర్వహించిన జనతా దర్బార్‌లో సైతం ఆయన దృష్టికి తీసుకువెళ్లాడని 'ప్రభాత్ ఖబర్' కథనం తెలిపింది.

ప్రకాష్ పాండే తనను తాను ట్రాన్స్‌పోర్టర్‌గా చెప్పుకున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో రుణాలు తీర్చలేక ఊబిలో కూరుకుపోయినట్టు కూడా అతను జనతా దర్బార్‌లో వాపోయాడు.ప్రకాష్ వాపోయాడని ఆ కథనం తెలిపింది.

. కాగా, ఇది చాలా దురదృష్టకరమైన ఘటనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడే ఘటనని మాజీ సీఎం హరీష్ రావత్ విమర్శించారు. నోట్లరద్దు, జీఎస్‌టీకి పాండే బలయ్యాడని అన్నారు

English summary
A businessman who reached the BJP office in Uttarakhand after drinking poison two days ago died in a hospital today in state capital Dehradun. The transporter's suicide has reignited criticism of the centre's demonetisation decision and the introduction of the Goods and Services Tax that the transporter blamed for ruining him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X