Crime News: ఇంటికి రమ్మని ఫోన్ చేసింది.. రాగానే కూతురు అని చూడకుండా గొంతు కోసింది..
పిల్లలు అంటే తల్లి ఎంతో ప్రేమ ఉంటుంది. చాలా మంది తల్లులు పిల్లలే జీవితంగా బతుకుతారు. అయితే కొంత మంది పిల్లలు చేసిన పనికి తట్టులేక హత్యలకు పాల్పడుతున్నారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఢిల్లీలోని బదర్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఆయుషి యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. నవంబర్ 18న ఆమె ఇంటికి తిరిగి వచ్చారు. పెళ్లి విషయంలో ఆమెకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో తండ్రి ఆయుషిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది.

తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి సూట్‌కేస్‌లో పెట్టారు.నవంబర్ 19న తెల్లవారుజామున 3 గంటలకు, తల్లి,తండ్రి తమ కుమార్తె మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను యమునా ఎక్స్‌ప్రెస్ వే పక్క ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలోని పొదల్లో పడేశారు. ఈ ఘటన మరవక ముందే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో బుధవారం నాడు తన కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు ఓ తల్లి తన 20 ఏళ్ల కుమార్తెను గొంతు కోసి హత్య చేసింది. యువతి హత్య కుల హత్యగా అనుమానిస్తున్నారు.
అరుణ అనే విద్యార్థిని కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇదే సమయంలో అరుణుకు ఇంటి వద్ద పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న అరుణ తన తల్లి ఆరుముగకాని కి ఫోన్ చేసి తన ప్రేమ గురించి చెప్పింది. దీంతో ఆమె తల్లి అరుణను వెంటనే ఇంటి రావాల్సిందిగా కోరింది.
అరుణ ఇంటి రాగానే ఆరుముగకాని ప్రేవ పెళ్లి వద్దని చెప్పింది. తాను ఓ పెళ్లి సంబంధం చూశానని అతన్నే వివాహం చేసుకోవాలని కోరింది. అయితే అరుణ పెళ్లిని వ్యతిరేకించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన తల్లి కూతురిని గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. వారిని గమనించిన చుట్టు పక్కల వారు వారిని చికిత్స నిమిత్తం వారిద్దరినీ తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
అక్కడికి చేరుకోగానే అరుణ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆరుముగకానిఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుణ తండ్రి, సోదరుడు ప్రస్తుతం చెన్నైలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుల హత్య కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుముగకాని ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
-
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications