మాణిక్ సర్కార్ ఇంటికి వెళ్ళిన బిప్లవ్ దేబ్, రామ్ మాధవ్, ఏమైందంటే?
అగర్తల:నాలుగు సార్లు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన విశేష రాజకీయ అనుభవం ఉన్న మాణిక్ సర్కార్ సలహలను తమ ప్రభుత్వం తీసుకొంటుందని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు బిప్లవ్ దేబ్ ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వరుస విజయాలు సాధించిపెట్టడంలో కీలక పాత్ర వహిస్తున్న రామ్ మాధవ్‌తో కలిసి ఆయన స్వయంగా మాణిక్ సర్కార్ ఇంటికి వెళ్లారు. సీఎంగా ఒకే గదిలో నిరాడంబరంగా గడిపిన మానిక్ తాజాగా సీపీఎం ఆఫీసు కార్యాలయంలోని రెండు గదుల నివాసానికి మారారు.
బీజేపీ నేతలిరువురూ అక్కడే మానిక్‌ను కలిసి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మాణిక్ సైతం వారితో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వారి మర్యాదపూర్వక ఆహ్వానాన్ని మన్నించారు. తప్పనిసరిగా వస్తానని చెప్పడమే కాకుండా ఆ మాటను నిలుపుకొన్నారు.

మాణిక్ సర్కార్ ఇరవై ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ అతి పేద సీఎంగానే నిలిచారు. సొంత కారు కానీ, ఇల్లు కానీ లేవు. కాళ్లకు సాదారణ చెప్పులే వేసుకునే వారు. నెలవారీ వేతనం పార్టీకే. కేవలం పార్టీ ఇచ్చే స్వల్ప మొత్తంతోనే ఆయన నిరాడంబర జీవితం గడిపేవారు.
సీఎం అయినప్పటికీ ఒకే గదిలో ఆయన భార్యతో కలిసి నివసించేవారు. తాజాగా ఆయన నివాసం సీపీఎం గెస్ట్ హౌస్‌కు మారింది. అక్కడ రెండు గదులన్నా ఎలాంటి హంగులూ ఆర్భాటాలు వద్దని మాణిక్ తేల్చిచెప్పేశారు. పార్టీ ఆఫీసులో ఏదైతే వండుతున్నారో అదే తింటామని, ప్రత్యేక వంటకాలు అవసరం లేదని వంటవాళ్లకు చెప్పారు. మానిక్, పాంచాలి భట్టాచార్య దంపతులకు సంతానం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications