Viral Video: యూపీలో పట్టపగలు దారుణం.. గన్‍తో బెదిరించి.. వైరల్ అయిన వీడియో..
యూపీలో దోపిడీ దొంగలు బరితెగించారు. పట్ట పగలే దోపిడీలకు పాల్పడుతూ భయభ్రంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఘజియాబాద్‌లో ఓ దుండగుడు పట్టపగలు ఓ మహిళ నుంచి బంగారం దోపిడీ చేశారు. గన్ తో బెదిరించి బంగారాన్ని దొచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విహార్ చౌకీ
ఠాణా లోని అంకుర్ విహార్ చౌకీ ప్రాంతంలోని గోకుల్ధామ్ సొసైటీ రోడ్డుపై వెళ్తున్న మహిళను ఓ దుండగుడు గన్ తో బెదిరించి బంగారు గొలుసు లాక్కున్నాట్లు వీడియోలో కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఓ యువకుడు అడ్డురావడంతో అతన్ని కూడా బెదిరించి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించి దృశ్యాలు ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

భయానక వాతావరణం
పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Two miscreants looted a woman at Gunpoint, outside her house in Gokul Dham Society of Loni police station area in Ghaziabad. pic.twitter.com/v166K0vzcE
— Nikhil Choudhary (@NikhilCh_) December 12, 2022












Click it and Unblock the Notifications