వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నకోడలే చిచ్చు పెట్టిందా?: అఖిలేష్-ములాయం ముసలం వెనుక..

రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న అపర్ణ యాదవ్ ఎస్పీ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముంగిట్లో ఎస్పీలో ముదిరిన ముసలం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తండ్రీ-కొడుకుల పోరు తారాస్థాయికి చేరడంతో పార్టీ భవిష్యత్తు ఉనికి ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తూ ములాయం జాబితాను విడుదల చేయడం.. దాన్ని సవాల్ చేసేలా సీఎం అఖిలేష్ మరో జాబితాను విడుదల చేయడంతో ఇద్దరి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి.

మొత్తంగా అఖిలేష్ వల్ల పార్టీకి డ్యామేజీ జరుగుతుందని చెబుతూ కొడుకును ములాయం పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆరేళ్లపాటు అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటి వెనుక ములాయం చిన్న కోడలు అపర్ణ పేరు బలంగా వినిపిస్తోంది.

అఖిలేష్ జాబితాలో ఆ స్థానం ఖాళీగా!..

అఖిలేష్ జాబితాలో ఆ స్థానం ఖాళీగా!..

కాగా, తండ్రి ములాయం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను సవాల్ చేస్తూ.. 235మంది రెబల్ అభ్యర్థులతో అఖిలేష్ తన సొంత జాబితా ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి కారణం.. ఆ స్థానాన్ని ములాయం తన చిన్న కోడలికి ఇదివరకే ఖరారు చేశారు.

అఖిలేష్‌కు పోటీగా అపర్ణయాదవ్..

అఖిలేష్‌కు పోటీగా అపర్ణయాదవ్..

ములాయం రెండో భార్య సాధనాగుప్తా పార్టీలో అఖిలేష్ చేతుల్లోంచి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి అపర్ణ యాదవ్ ను తెరమీదకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. 26ఏళ్ల అపర్ణ యాదవ్ సాధానగుప్త తనయుడైన ప్రతీక్ సతీమణి. రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న అపర్ణ యాదవ్ ఎస్పీ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు.

ములాయంపై సాధనా గుప్తా ఒత్తిడి:

ములాయంపై సాధనా గుప్తా ఒత్తిడి:

బాబాయ్ శివపాల్ యాదవ్-అబ్బాయ్ అఖిలేష్ యాదవ్ పోరులో ములాయం శివపాల్ యాదవ్ నే వెనుకేసుకురావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. ములాయం రెండో భార్య సాధనాగుప్తా శివపాల్ యాదవ్‌కే మద్దతు పలకాలని ములాయంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అఖిలేష్ యాదవ్ కు ములాయం రెండో భార్య సాధనాగుప్త వర్గం వ్యతిరేకంగా మారింది.

ఆ లేఖలో కూడా..

ఆ లేఖలో కూడా..

ఎస్పీ ప్రజా ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ దీనిపై స్పందిస్తూ రాసిన ఓ లేఖ ఈ వాదనలకు ఊతమిస్తోంది. బాబాయ్-అబ్బాయ్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న క్రమంలో.. ఆయన లేఖ రాశారు. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేష్ ను టార్గెట్ చేసిందని లేఖలో పేర్కొన్నారు.

అపర్ణ యాదవ్ విషయంలో ఇలా:

అపర్ణ యాదవ్ విషయంలో ఇలా:

ఇదిలా ఉంటే, అపర్ణయాదవ్ కే కేటాయించిన లక్నో కంటోన్మెంట్ లో ఎస్పీకి పట్టు లేదు. ఇంతవరకూ ఆ స్థానంలో పార్టీ గెలిచింది లేదు. అలాంటి స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వడం పట్ల అపర్ణ గుర్రుగా ఉన్నారు. అఖిలేష్ భార్య డింపుల్ విషయంలో ఈ పరిస్థితి వేరుగా ఉంది.

అఖిలేష్ భార్య విషయంలో మరోలా:

అఖిలేష్ భార్య విషయంలో మరోలా:

పార్టీ సునాయసంగా గెలిచే స్థానం నుంచి డింపుల్ ను పోటీకి దించడంతో.. ఆమె పెద్దగా కష్టపడకుండానే పార్లమెంటులో అడుగుపెట్టారు. మరోవైపు అపర్ణ మాత్రం తన గెలుపు కోసం కష్టపడాల్సి వస్తోంది.

ఈ పరిస్థితులన్ని ములాయం రెండో భార్యకు, ఆమె కుమారుడు ప్రతీక్ కు ఏమాత్రం రుచించలేదు. దీంతో ములాయంపై ఒత్తిడి తీసుకొచ్చి అఖిలేష్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సాధనగుప్తా తనయుడు, అపర్ణయాదవ్ భర్త ప్రతీక్ రాజకీయాలకు దూరంగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

అపర్ణ మోడీ అభిమాని!

అపర్ణ మోడీ అభిమాని!

అపర్ణయాదవ్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఏంటంటే.. ఆమె మోడీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్బంగా భర్త ప్రతీక్ తో కలిసి మోడీతో ఓ సెల్ఫీ దిగారు. అప్పట్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అపర్ణ మోడీ అభిమాని కావడం కాకతాళీయమే కావచ్చు గానీ.. ఈమధ్య కాలంలో ములాయం కూడా మోడీపై ప్రశంసలు కురిపించడం గమనించాల్సిన విషయం. మొత్తంగా యూపీ రాజకీయాల్లో ఎస్పీలో ఏం జరుగుతందన్న ఆసక్తి దేశప్రజలను ఉత్కంఠకు గురిచేస్తోంది.

English summary
Mulayam Singh had named 26-year-old Aparna Yadav as the Samajwadi Party candidate from Lucknow Cantt about a year ago. Aparna is seen as part of the Shivpal Yadav camp in a party now split down the middle by the bitter power tussle between Akhilesh Yadav and his uncle Shivpal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X