పన్ను ఎగవేతదార్ల పేర్లు విడుదల, 18 కంపెనీల్లో 11 గుజరాత్‌కు చెందినవే
న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పన్ను ఎగవేతదారులపై కొత్త పంథాను అనుసరిస్తోంది. అందులో భాగంగా మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి కొత్త కొత్త విధానాలను అవలంబిస్తోంది.
పన్ను ఎగవేసిన వారికి నోటీసులు పంపింది. సమాధానాలు రాకపోవడంతో ప్రస్తుతానికి 18 మంది పన్ను ఎగవేతదార్ల పేర్లను మీడియాకు విడుదల చేసింది. వాటిలో ఒక్క గుజరాత్‌కు చెందిన సంస్దలే 11 ఉండటం గమనార్హం.

ఈ జాబితాలోని సోమానీ సిమెంటు 27 కోట్లు, బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 75 కోట్లు, యాపిల్ టెక్ సొల్యూషన్స్ 27 కోట్లు, గోల్డ్‌సుఖ్ ట్రేడ్ ఇండియా 75 కోట్లు, జూపిటర్ బిజినెస్ రూ. 21 కోట్ల మేర తదితర కంపెనీలు కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు బాకీ పడ్డాయి. వీరంతా కలిసి దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయ పన్నును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది.
పన్ను ఎగవేతదార్ల పేర్లను ఆదాయ పన్ను విభాగం తన వెబ్‌సైట్‌లో గతంలోనే ఉంచింది. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఇలా చేసిందని, కొందరిని ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కష్టంగా ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. నోటీసుల పంపినా సమాధానాలు రాకపోవడంతో, ఇలా పేర్లు వెల్లడించాల్సి వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications