పోయెస్ గార్డెన్ లో ఐటీ దాడులు: ఆర్ కే నగర్ దెబ్బ, శశికళ ఫ్యామిలీకి సినిమా, ఫినిష్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పోయెస్ గార్డెన్ లోని జయా టీవీ పాత కార్యాలయంతో పాటు తమిళనాడులో 12 ప్రాంతాల్లో గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు.

  ఐటీ దాడులు, ఆర్థికంగా దెబ్బ ?
  జయలలిత ఇల్లు

  జయలలిత ఇల్లు

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలికు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంకు కూతవేటు దూరంలో జయా టీవీ పాత కార్యాలయం ఉంది. ఇప్పుడు ఆ కార్యాలయం మూసివేసి వేరే ప్రాంతంలో జయా టీవీ కార్యాలయం నిర్వహిస్తున్నారు.

  టార్గెట్ పోయెస్ గార్డెన్

  టార్గెట్ పోయెస్ గార్డెన్

  పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలో ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి అనేక గదులు పరిశీలించారు. జయలలితకు చెందిన రెండు ప్రత్యేక గదులతో పాటు మరో రెండు గదలు సీజ్ చేశారని తెలిసింది.

  మన్నార్ గుడి మాఫియా

  మన్నార్ గుడి మాఫియా

  2017 నవంబర్ నెలలో శశికళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని చెన్నై నగరంతో సహ తమిళనాడులోని 187 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆ సందర్బంలో స్వాధీనం చేసుకున్న కీలకపత్రాలను అధికారులు పరిశీలించారు.

  సాక్షం చేతిలో

  సాక్షం చేతిలో


  జయా టీవీ కార్యాలయం, శశికళకు చెందిన మిడాస్ మద్యం కంపెనీ, చిన్నమ్మ మేనల్లుడు వివేక్, అతని సోదరి క్రిష్ణప్రియ, టీటీవీ దినకరన్, దివాకరన్, టీటీవీ భాస్కరన్, ఇళవరసి అల్లుడు కార్తికేయన్, డాక్టర్ శ్రీనివాసన్ తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు మళ్లీ సోదాలు మొదలు పెట్టారు.

  పోయెస్ గార్డెన్ లో

  పోయెస్ గార్డెన్ లో

  పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం, అదే ప్రాంతంలోని జయా టీవీ పాత కార్యాలయం, మిడాస్ మద్యం కంపెనీ, కోయంబత్తూరులోని ఇళవరి అల్లుడు కార్తికేయన్ కు చెందిన ఇంజనీరింగ్ కాలేజ్, క్రిష్ణప్రియ ఇల్లు, వివేక్ ఇల్లు, శ్రీసాయి కంపెనీస్ కార్యాలయాలు, గౌడన్ తో సహ 12 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After a break, income tax officials on Thursday once again searched the old office of Jaya TV located at Poes Garden in the Chennai city and scrutinised documents there.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి