ఆదాయపు పన్ను రిటర్నుల తుదిగడువు పొడిగింపు: ఎప్పటివరకంటే..?
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులకు తుదిగడువును ది సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించింది. ఇప్పటి వరకు జులై 31ని తుది గడువుగా ప్రకటించినా.. ప్రస్తుతం దీనిని ఆగస్టు 31కి పొడిగిస్తూ సీబీడీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
తుది గడువును పొడిగించాలని పలు సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుదిగడువులోపు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే రూ.1,000, రూ 5,000, రూ.10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా, అపరాధ రుసుం ఎంతా అనేది రిటర్ను దాఖలు చేసిన తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు. 2018-19 సంవత్సరానికి కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ అసెస్‌మెంట్ ఫారాలను ఏప్రిల్ 5వ తేదీన సీబీడీటీ విడుదల చేసింది.












Click it and Unblock the Notifications