IND vs AUS final: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. ఎప్పటికీ ఇంతేనా: మళ్లీ ప్రూవ్
ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్‌ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ ఓటమి సోషల్ మీడియాలో సరికొత్త డిబేట్స్‌కు తెర తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు జరిగిన మూడు ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్స్ వరల్డ్ కప్‌లల్లో భారత్ ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే.
2015లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ కప్‌లో భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. సిడ్నీ క్రికెట్ ట్రౌండ్స్‌లో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఇదే ఆస్ట్రేలియా జట్టు చేతిలో పరాజయాన్ని చవి చూసింది. ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. 95 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది ఆసీస్.
2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఎదురుగాలే వీచింది. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా రాణించినప్పటికీ.. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది భారత్. 18 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థిితి. ఈ మూడు వరల్డ్ కప్ సమయాల్లో కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది.
దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ అవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఎప్పటికీ భారత్. వరల్డ్ కప్‌ను అందుకోలేదనే అభిప్రాయాలను పోస్ట్ చేస్తోన్నారు క్రికెట్ అభిమానులు. క్రికెట్‌ను కూడా కాషాయమయం చేయడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications