
ఝులన్ గోస్వామి రిటైర్‌మెంట్: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన ఝులన్ గోస్వామికి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారంనాటి మ్యాచ్ ఆఖరి మ్యాచ్.
భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఆడుతున్న వన్ డే ఇంటర్నేషనల్ (ఓడీఐ) సిరీస్ ఆమెకు చివరి సిరీస్.
కొన్నేళ్ల క్రితం ఆమె లార్డ్స్‌లో క్రికెట్ ఆడిన తర్వాత తిరిగి ఆ మైదానంలో అడుగు పెడతానో లేదోననే సందేహంతో మైదానంలో చిన్న గడ్డి పరకను తీసుకుని జ్ఞాపకంగా దాచుకున్నారు.
గోస్వామి మహిళల క్రికెట్‌లో ఎంతో మందికి మార్గదర్శకంగా మారి చాలామంది క్రికెట్‌ను ఒక కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.
భారతీయ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఈమె మహిళల, అంతర్జాతీయ క్రికెట్ లో జరిగిన 283 మ్యాచ్‌లలో 353 వికెట్లు తీసుకున్నారు.
"నేను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టేసరికి, ఆమె కెప్టెన్‌గా ఉన్నారు. ఆమె ఆడుతున్న ఇంటర్నేషనల్ వన్డేకు నేతృత్వం వహించడం నాకు లభించిన గొప్ప అవకాశం" అని భారత క్రికెట్ మహిళల జట్టుకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.
"ఆమెతో పాటు కొన్ని మధురమైన క్షణాలను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుత క్షణాలను పోగు చేసుకునేందుకు క్రికెట్ బృందం ప్రయత్నిస్తోంది" అని చెప్పారు.
39ఏళ్ల గోస్వామి సెప్టెంబరు 18న ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేలలో మొదటి వన్డే నాటికి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో పెద్ద వయసు ఉన్న వ్యక్తి. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్‌కు ఉండేది. ఆమె ఈ ఏడాది జూన్‌లో రిటైర్ అయ్యారు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గోస్వామి తన ప్రతిభను ప్రదర్శించారు. "ఆమె ఎప్పుడూ ఆటలో తగ్గలేదు. ఎప్పుడూ ఒకేలా ఆడతారు" అని ఇంగ్లాండ్ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ ఏమీ జోన్స్ అన్నారు.
- సచిన్ తెందుల్కర్ అంతు చూడాలనుకున్నాను: షోయబ్ అఖ్తర్
- మహిళల క్రికెట్ వరల్డ్ కప్ INDvsWI: వెస్టిండీస్‌పై భారత్ విజయం

గోస్వామి ఇంత కాలం క్రికెట్‌లో ఉండటానికి, స్థిరత్వానికి ఆమె శరీరం పట్ల అవగాహన, ఆట పట్ల ఆమెకున్న శ్రద్ధ కారణం.
"ఒక తరంలో ఒకసారి మాత్రమే ఇలాంటి క్రీడాకారులు వస్తారు" అని ఆమె గురించి భారతీయ పురుషుల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ వర్ణించారు.
"పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్న వారికి గోస్వామి ఆట పట్ల చూపించిన అంకిత భావం స్ఫూర్తిని కలిగిస్తుంది" అని అన్నారు.
భారతదేశంలో పురుషుల క్రికెట్‌కు లభించినంత ఆదరణ, గుర్తింపు, నిధులు మహిళల క్రికెట్‌కు లభించలేదు.
ఆమె పశ్చిమ బెంగాల్‌లోని చక్‌దహా గ్రామం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎదిగారు. మిథాలీ 23 ఏళ్ల క్రికెట్ కెరీర్ మాదిరిగానే ఈమె క్రికెట్ ప్రయాణం కూడా వ్యవస్థకు అతీతంగా సాగింది.
బెంగాలీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఈమె కుటుంబానికి ఎటువంటి క్రీడా నేపధ్యం లేదు. 1997లో కోల్‌కతాలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరిగే వరకు తాను క్రికెట్‌లో కెరీర్‌గా మార్చుకోవాలని అనుకోలేదు.
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరిగిన వన్ డే మ్యాచ్‌లో ఆమె బాల్ గర్ల్‌గా వ్యవహరించారు.
ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయం ఆమెకు భారత్ తరుపున ఆడాలనే కోరికను కలిగించింది.
స్వపన్ సాధు ఆమెకు శిక్షణ ఇచ్చారు. ఆమెకు 15 ఏళ్ల వయసులో కోల్‌కతాలోని వివేకానంద పార్కులో సాధు శిక్షణ మొదలుపెట్టారు. శిక్షణ కోసం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి రోజూ రెండున్నర గంటల ప్రయాణం చేసి వచ్చేవారు.
- వింబుల్డన్: పీరియడ్స్ సమయంలో మహిళా క్రీడాకారులు తెల్లటి దుస్తులు ధరించడం ఆట మీద ప్రభావం చూపుతుందా?
- మిథాలీ రాజ్: 'క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’

1990లలో తొలిసారిగా దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టు తరుపున ఆడారు. జనవరి 2002లో మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడారు.
ఆమెకు ప్రధానంగా బౌలింగ్ లో నైపుణ్యం ఉన్నప్పటికీ, క్రమంగా బ్యాటింగ్‌లో కూడా అడుగుపెట్టారు. 2006లో ఆమె సాధించిన హాఫ్ సెంచరీ, భారత్ ఇంగ్లాండ్‌తో ఆడిన సిరీస్‌ను గెలిచేందుకు సాయపడింది.
2000లో చాలాకాలం వరకు మహిళల క్రికెట్ లో అత్యంత వేగంగా బంతిని విసిరే బౌలర్‌గా ఆమె నిలిచారు. 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధానం చేసిన మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు అయ్యారు.
అక్టోబరు 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగడానికి ముందు మిథాలీ రాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు.
అదే నెలలో, ఐసీసీ మహిళా క్రికెటర్లకు ప్రపంచ ర్యాంకులు ఇవ్వడం ప్రవేశపెట్టింది. ఈ ర్యాంకింగ్‌లో ఆమె నంబర్ 1 ర్యాంకును సంపాదించారు.
ఇంగ్లాండ్‌లో జరిగిన 2017 వన్ డే ఇంటర్నేషనల్ గోస్వామి కెరీర్‌ను ప్రధాన మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇది గోస్వామికి నాల్గో 50 ఓవర్ల ప్రపంచ టోర్నమెంట్.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ లో ఆడిన ఫైనల్స్‌లో ఆమె చేసిన బౌలింగ్, భారత్‌కు విజయాన్ని చేకూర్చింది.
అదే సమయంలో గోస్వామి దక్షిణ ఆఫ్రికాలో కూడా కొన్ని చరిత్రాత్మక మైలురాళ్లను సృష్టిస్తున్నారు.
మే 2017లో ఆమె చేసిన 181వ డిస్మిసల్‌తో మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో వికెట్ టేకర్ల జాబితాలో అగ్రస్థానంలో నిల్చోబెట్టింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కాథరిన్, ఫిట్జ్ ప్యాట్రిక్ రికార్డును అధిగమించారు. 2018 ఫిబ్రవరిలో ఆమె మహిళల వన్ డే ఇంటర్నేషనల్ లో 200 వికెట్లను తీసుకున్న తొలి మహిళగా నిలిచారు.
- క్రికెట్ రూల్స్ మార్చిన ఐసీసీ.. ఈ 8 కొత్త నిబంధనలతో లాభం బౌలర్కా లేక బ్యాటర్‌కా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్

2018 టీ-20 ప్రపంచ కప్‌కు మూడు నెలల ముందు గోస్వామి టీ-20 ఇంటర్నేషనల్స్ నుంచి వైదొలిగారు. క్రికెట్ లో వచ్చిన షార్ట్ ఫార్మాట్‌కు తన శరీరం సహకరించడం లేదని చెప్పారు.
ఒకవైపు భారత్ యువ క్రీడాకారులను వెతుక్కునే పనిలో ఉండగా, గోస్వామి ప్రపంచ కప్ లో గెలిచేందుకు తన ప్రయత్నాలను పునరుద్ధరించారు. భారతీయ మహిళల క్రికెట్ ను తర్వాతి స్థాయికి తీసుకుని వెళ్లేలా ప్రేరేపించేందుకు ఈ టైటిల్ ఒక టానిక్‌లా పని చేస్తుందని ఆమె అన్నారు.
2017 ప్రపంచ కప్ కోసం జరిగిన ప్రచారం కూడా గోస్వామికి పేరు తీసుకు రావడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
కానీ, 2022లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌కు ముందు తగిలిన గాయం గోస్వామి వేగాన్ని తగ్గించింది. ఊహించని పరిణామంగా ఆమె జట్టు లీగ్ స్థాయిలోనే తప్పుకోవాల్సి వచ్చింది.
ఇది జరిగిన మూడు నెలల తర్వాత మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2022 ప్రపంచ కప్ టోర్నమెంట్ గోస్వామికి ఫైనల్ ఆట అవుతుందనే ఊహాగానాలు వినిపించాయి.
కానీ, అలా జరగలేదు. గోస్వామి బౌలింగ్ తన ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు, ఝూలు దీ (ఝూలు అక్క-జట్టు సభ్యులు ఆమెను ప్రేమగా పిలిచే పేరు) ఆఖరిసారిగా హుర్రే అనిపించుకునేందుకు లార్డ్స్ మైదానం వేదిక.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి వల్ల వయసు కనిపించదా
- పుట్టగానే ఆసుపత్రిలో తారుమారయ్యారు.. ఇరవై ఏళ్ల తరువాత వాళ్లిద్దరే పెళ్లి చేసుకున్నారు
- ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది
- కృష్ణ వ్రింద విహారి రివ్యూ: ఎక్కడో చూసినట్లుందే అనిపించే సినిమా
- 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)