ఇంటికి వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఎన్ని కిటికీలుండాలి?

సొంత ఇంటి కల నిజమవ్వడం ఒక ఎత్తయితే, ఆ ఇంట్లో అడుగుపెట్టాక సుఖసంతోషాలతో వర్ధిల్లడం మరో ఎత్తు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు సింహద్వారం ఎటుండాలి? వంటిల్లు ఎక్కడ ఉండాలి? అని గంటల తరబడి చర్చిస్తాం. కానీ, అదే ఇంట్లోకి గాలి, వెలుతురునిచ్చే'కిటికీల' విషయంలో మాత్రం చాలామంది అశ్రద్ధ చేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీలు కేవలం గాలి కోసం మాత్రమే కాదు.. అవి అదృష్టాన్ని మోసుకొచ్చే ద్వారాలు. ఇంటి కిటికీల వాస్తును మార్చి, జీవితంలోకి సానుకూలతను ఎలా ఆహ్వానించాలో తెలుసుకుందాం.

కిటికీలు పెట్టే దిశ మీ ఇంటి ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులను శాసిస్తుంది.
తూర్పున కిటికీలు ఉండటం ఎంతో శుభప్రదం.
ఉదయపు సూర్య కిరణాలు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల
క్రిమికీటకాలు నశించి, ఇంట్లోని వారికి ఆరోగ్యం, తేజస్సు లభిస్తాయి.
ఉత్తరం వైపు కిటికీలు ఉంటే సంపద వృద్ధి చెందుతుందని వాస్తు చెబుతోంది.
ఇది లాభాలను తెచ్చిపెట్టే దిశ.
అందుకే ఈ వైపు కిటికీలు కాస్త పెద్దవిగా ఉన్నా ఇబ్బంది లేదు.
ఈశాన్యం మూలన కిటికీలు ఉంటే ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత లభిస్తాయి.

Vastu Tips According to the Principles in which direction and how many windows should a house have

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే,
ఇంట్లోని కిటికీల సంఖ్య కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది.
వాస్తు ప్రకారం కిటికీల సంఖ్య ఎప్పుడూ సరిసంఖ్యలోనే ఉండాలి.
అయితే 10, 20 వంటి సంఖ్యలను నివారించాలి.
బేసి సంఖ్యలో కిటికీలు ఉంటే ఇంట్లో కలహాలు లేదా
నిర్ణయాల్లో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

దక్షిణం, నైరుతి దిశల నుండి వచ్చే గాలి, వెలుతురులో తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
దక్షిణ, పడమర దిశల్లో కిటికీలు వీలైనంత చిన్నవిగా ఉండాలి.
నైరుతి మూలలో కిటికీలు ఉంటే వాటికి మందపాటి తెరలు వాడాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి లోపలికి రాకుండా ఉంటుంది.

కిటికీలు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు కిర్రుమనే శబ్దం రాకూడదు.
ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి సంకేతం. అలాంటి శబ్దాలు వస్తే వెంటనే ఆయిల్ వేసి రిపేర్ చేయించాలి.
పగిలిన అద్దాలు లేదా పాతబడిన ఫ్రేములు ఇంట్లో దరిద్రానికి సూచికలు. వెంటనే మార్చాలి.
ఇంటి ప్రధాన ద్వారం కంటే కిటికీలు ఎత్తులో తక్కువగా ఉండాలి.
అలాగే కిటికీలు లోపలి వైపునకే తెరుచుకోవడం ఉత్తమం.
కిటికీల మీద దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి.
స్వచ్ఛమైన అద్దాల గుండా వచ్చే వెలుతురు మాత్రమే ఇంట్లో సానుకూలతను నింపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+