తిరుచ్చి బై పోల్ లో స్టాలిన్ vs త్రిష, విజయ్ కొత్త స్కెచ్ - అక్కడే బిగ్ ట్విస్ట్..!!
తమిళనాట రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. AIADMK చీలిక వర్గం మద్దతుతో విజయ్ బలం అసెంబ్లీలో 144 కి చేరింది. దీంతో.. ప్రభుత్వం పూర్తిస్థాయి మెజార్టీతో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కాగానే విజయ్ తిరుచ్చి సీటుకు రాజీనామా చేసి.. పెరంబూర్ లో కొనసాగాలని నిర్ణయించారు. ఇప్పుడు తిరుచ్చి బై పోల్ కు మాజీ సీఎం స్టాలిన్ సిద్దం అవుతున్నారు. దీంతో.. స్టాలిన్ లాంటి బలమైన నేత టీవీకే అభ్యర్దిగా త్రిష పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడే టీవీకే మిత్రపక్షాలు ఊహించని విధంగా స్పందిస్తున్నాయి.
తమిళనాడు లో విజయ్ కు హామీల అమలు.. పాలన పైన పట్టు సాధించే క్రమంలో రాజకీయంగా మరో సవాల్ ఎదురవుతోంది. విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. వాటిల్లో తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేసారు. ఆ స్థానం నుంచి మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే అభ్యర్దిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇందు కోసం త్వరలోనే నియోజకవర్గంలో పర్యటించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్ తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ ఓడిపోవటం తో ఆయన పైన సానుభూతి కనిపిస్తోంది. ఇదే సమయంలో స్టాలిన్ బరిలోకి దిగితే.. ఈ ఉప ఎన్నికలో గెలుపు సీఎం విజయ్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. స్టాలిన్ పోటీ చేయటం ఖాయమని టీవీకే నేతలు సైతం అంగీకరిస్తున్నారు. హీరోయిన్ త్రిషను టీవీకే నుంచి బరిలోకి దింపటం ద్వారా గెలుపు సాధ్యం అవుతుందని విజయ్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

తిరుచ్చి ఉప ఎన్నిక పైన మొదలైన అంచనాలు
ఇక ఎన్నికలకు ముందు ఆమె విజయ్ పార్టీ తరఫున పోటీచేస్తారని, ప్రచారం చేస్తారని రకరకాల ప్రచారం జరిగింది. కానీ, త్రిష ఎన్నికల ముందు టీవీకేకి మద్దతు ప్రకటించడం వరకే పరిమితం య్యారు. అయితే.. విజయ్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మిత్రపక్షాలతో చర్చించిన తరువాతే ఖరారు చేయాల్సి ఉంటుంది. స్టాలిన్ మిత్రపక్షాలే... ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సీటు నుంచి పోటీకి విజయ్ కు మద్దతు ప్రకటించిన వీసీకే చీఫ్ తిరుమావళవన్ కోరుతున్నారు. మిత్రపక్షాలు పట్టు బడితే వీసీకే కు తిరుచ్చి సీటు కేటాయించాల్సి ఉంటుంది. మరో వైపు స్టాలిన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని తిరుచ్చి జిల్లా డీఎంకే పార్టీ నేతలు తాజాగా తీర్మానం చేశారు. దీంతో.. స్టాలిన్ వంటి బలమైన నేతను ఢీ కొట్టే విషయంలో విజయ్ ఎవరిని బరిలోకి దింపుతారా.. త్రిష విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications