వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటిన ఇండియా.. తక్కువ సమయంలోనే బీట్..
దేశవ్యాప్తంగా కరోనా టీకాల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో కోటి మందికి వ్యాక్సిన్ అందజేశారు. దేశంలో కూడా వ్యాక్సినేషన్ అలానే జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికాను భారత్ దాటేసింది. అమెరికా కన్నా ఎక్కువ మందికి టీకాలను.. తక్కువ వ్యవధిలో అందజేసింది. దేశంలో 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 డోసుల టీకాలు వేయగా.. అమెరికాలో 32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసులు వేశారు.

తక్కువ సమయంలోనే..
అమెరికా కన్నా తక్కువ సమయంలో అన్ని డోసులు వేశారు. అదే అమెరికాకు ఆరు నెలల సమయం పడితే.. మనకు కేవలం ఐదు నెలలే పట్టింది. అమెరికా కన్నా నెల ముందే ఆ మార్కును భారత్ అధిగమించింది. డిసెంబర్ 14న అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యింది. భారత్ లో జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం 86 లక్షల డోసుల టీకాలు వేసి ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్ వేసిన రికార్డును భారత్ సాధించింది.

పుంజుకున్న వ్యాక్సినేషన్
తర్వాత టీకా కార్యక్రమం మళ్లీ స్లో అయింది. నిన్న 13.9 లక్షల మందికి ఫస్ట్ డోస్ టీకా వేశారు. మరో 3.3 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. మొత్తంగా 17.21 లక్షల డోసుల వ్యాక్సిన్ నే ప్రజలకు వేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటోందని, ఈ ఘనతలో భాగమైన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు వేయడమే తమ ప్రాధాన్యమని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.
ఇదీ గ్రాఫ్
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సమాజం, ప్రభుత్వం అండతోనే ఈ ఘనత సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వివిధ దేశాలతో పోలుస్తూ వ్యాక్సినేషన్ లో భారత్ ఏ స్థానంలో ఉందో గ్రాఫ్ ను ట్వీట్ చేశారు. జూన్ 21 నుంచి 45 ఏళ్ల లోపున్న వారికీ వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే అందరికీ ఉచితంగా టీకాలు వేస్తోంది. ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే పేదవారికి ఉచిత టీకా కోసం ఈ-వోచర్లను అందిస్తోంది.












Click it and Unblock the Notifications