బంగ్లాలో హిందువుల హత్యలపై కేంద్రం ఫస్ట్ రియాక్షన్..! తీవ్ర హెచ్చరిక..!

బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్ధిరతను ఆసరాగా చేసుకుని అక్కడి మైనార్టీ హిందువులపై ఆకతాయిలు మూకదాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకూ ఇద్దరు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ముందు దీపు చంద్ర అనే బట్టల వ్యాపారిని చింపేసిన అల్లరి మూకలు, తాజాగా అమృత్ మండల్ అనే మరో వ్యక్తి ప్రాణాలు తీసారు. అయినా కేంద్రం దీనిపై స్పందించకపోవడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విదేశాంగశాఖ స్పందించింది.

బంగ్లాదేశ్ లో (bangladesh)హిందువులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్ లోనూ ఆ దేశ రాయబార కార్యాలయం ఎదుట హిందూ సంస్ధలు తాజాగా తీవ్ర స్దాయిలో నిరసనలకు దిగాయి. దీంతో కేంద్రం ఇవాళ బంగ్లాదేశ్ హత్యలపై స్పందించింది. బంగ్లాలో చోటు చేసుకుంటున్న హిందువుల హత్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు విదేశాంగ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు. వీటిని తేలిగ్గా తీసుకోబోమని ఆయన తెలిపారు. దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

India Breaks Silence on Bangladesh Violence MEA Warns Against Ignoring Attacks on Hindus

సరిహద్దు వెంబడి జరుగుతున్న పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు. అయితే దాడులను తాము అడ్డుకోలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిస్సహాయత వ్యక్తం చేశారు. హిందువులపై జరుగుతున్న హింసను మాత్రం ఖండించింద. బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని తెలిపారు. తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన హిందూ యువకుడి హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలని కోరారు. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

India Breaks Silence on Bangladesh Violence MEA Warns Against Ignoring Attacks on Hindus

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించాలని ఇప్పటికే కేంద్రం ఆ దేశ తాత్కాలిక బాస్ యూనుస్ ను కోరింది. అయితే పూర్తిస్దాయిలో ప్రభుత్వం లేకపోవడంతో ఆయన కూడా నిస్సహాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని బేగం ఖలీజా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నిన్న దేశంలోకి రీఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయన గెలిచి ప్రధాని అయితే పరిస్ధితులు కుదుటపడతాయని భారత్ అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+