మోదీ ప్రభుత్వం పై ఇండియా, బీఆర్ఎస్ అవిశ్వాసం - ఎంపీలకు విప్ జారీ..!!

కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసానికి ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. మణిపూర్ పైన మణిపూర్‌పై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగా ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్..బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. 50 మంది ఎంపీలు సంతకాలు చేసారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించే అంశం పైన ఎంపీలకు విప్ జారీ చేసారు.

అవిశ్వాస నోటీసులు
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. 26 పార్టీల ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ లోక్ సభా పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ అవిశ్వాసం పైన నోటీసు ఇచ్చారు. ఇండియాలా భాగస్వామి కాకపోయినా..విడిగా బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఈ నోటీసు ఇచ్చారు. 50 మంది ఎంపీలు మద్దతుగా సంతకాలు చేసారు. ఈ తీర్మానం ద్వారా మణిపూర్ తో సహా అన్ని అంశాల పైన ప్రధాన నుంచి సమాధానం చెప్పించటమే ప్రతిపక్షాల లక్ష్యంగా కనిపిస్తోంది. ఐదేళ్ల కిందట జూలైలోనే మోదీ తొలి విడత సర్కారుపై 2018 జూలై 20న విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మళ్లీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి.

INDIA, BRS

బీఆర్ఎస్ సైతం
రాజ్యసభలో మణిపూర్‌పై 267 నిబంధన కింద చర్చ డిమాండ్‌ నుంచి పక్కకు తప్పుకోకూడదని నిర్ణయించారు. కాగా, మణిపూర్‌పై మోదీ సమాధానం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌పై విపక్షాలు వెనక్కుతగ్గక పోవడంతో 4వ రోజు కూడా ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మైక్‌ను చైర్మన్‌ కట్‌ చేయడంతో నిరసనగా ఇండియా కూటమి పార్టీలన్నీ వాకౌట్‌ చేశాయి. ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ను సెషన్‌ అంతటికీ సస్పెండ్‌ చేయడంపై విపక్షాలన్నీ సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కాగా, ప్రతిష్ఠంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చొరవ చూపారు. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం నిర్వహించారు.

INDIA, BRS

ఎంపీలకు విప్ జారీ
మణిపూర్‌పై చర్చకు ప్రతిష్టంభన తొలగేలా సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖర్గే, అధిర్‌ రంజన్‌ ఇతర విపక్ష నేతలకు లేఖ రాశారు. ఆరేళ్లుగా మణిపూర్‌ బీజేపీ పాలనలో ప్రశాంతంగా ఉందని.. కొన్ని కారణాలు, కోర్టు తీర్పులతో అలజడి రేగిందని పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌, మణిపూర్‌పై పరిష్కారానికి కృషి చేస్తామని, కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు. ఇటు ఢిల్లీ ఆర్డినెన్స్ ను బిల్లుగా తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ చేసేలా పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+