బాలీవుడ్ సినిమాలకే పరిమితమా?: ఇప్పుడేమంటావ్ మసూద్
న్యూఢిల్లీ: 'పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలు, జీహాదీలపైన భారత్ దాడులు చేసినట్టు చూపించడం కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితం' గత వారంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చేసిన వ్యాఖ్యలివి. మసూద్ అజహర్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ సైన్యం రగిలిపోయిందో ఏమో తెలియదు గానీ, గురువారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మెరుపుదాడికి దిగింది.
ఈ దాడిలో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు పాక్ జవాన్లను సైతం మరణించారు. వివరాల్లోకి వెళితే గత వారంలో రంగొనూర్ అనే ఆన్‌లైన్ సైట్‌లో మసూద్ అజహర్ 'భారతీయుల శూరత్వం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం' అంటూ ఓ ఆడియోలో మసూద్ అజహర్ వెక్కిరించారు.
ఉర్దూ భాషలో ఉన్న ఈ ఆడియోను ఈనెల 19న రంగొనూర్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. 'ది రియల్ పౌంటెన్‌హెడ్ ఆఫ్ పవర్' అనే టైటిల్‌తో 9.41 నిమిషాల నిడివిగల న్యూస్ బులిటెన్‌లో మసూద్ మట్లాడుతూ 'భారత్ బాలీవుడ్ సినిమాల్లోని హీరోలు తమ నీడను చూసి తామే భయపడుతుంటారు.
భారత్‌ను తిరుగులేని శక్తిగా, పాక్‌ను బలీయమైన దేశంగా చిత్రీకరిస్తుంటారు. ఆ హీరోల ఒంటినిండా ఉత్త గ్యాసే ఉంటుంది. సినిమాల్లో మాత్రం పాకిస్థాన్‌పై దాడి చేసినట్టు, క్యాంపులు ధ్వంసం చేసి ముజాహిదీన్లను పట్టుకున్నట్టు చిత్రీకరిస్తుంటారు. ఒక్క బుల్లెట్ కూడా ఆ హీరోలకు తగలదు. వాళ్లు మాత్రం ముజాహిదీన్లపై తూటాల వర్షం కురిపించేస్తుంటారు' అంటూ అజహర్ ఎద్దేవా చేశాడు.

ఇలా మసూద్ ఈ వ్యాఖ్యలు చేసి 10 రోజులు కూడా గడవక ముందే ఇండియన్ పారామిలిటరీ కమెండోలు పీఓకేలోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసి 38 మంది ఉగ్రవాదులను హతం చేశారు. పకడ్బందీ వ్యూహంతో భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి 7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications