చర్చల ద్వారా పరిష్కారం: రష్యా-ఉక్రెయిన్‌పై ఇండియా, చైనా వైఖరి ఇదే: జై శంకర్
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు దేశాల్లో శాంతి కోసం ప్రపంచం పాటుపడుతుంది. అయితే ఇండియా చైనా కూడా చర్చలే మార్గం అని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాల గురించి ఇటీవల భారతదేశానికి వచ్చిన సమయంలో వాంగ్ యూతో కలిసి మాట్లాడామని గుర్తుచేశారు.
అప్పుడే కాదు ఇఫ్పటికీ చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇష్యూ సాల్వ్ కావడానికి డిస్కషన్స్ మొదటి అడుగు అని ఆయన చెప్పారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్యాపై భారత్, చైనా వైఖరి ఏంటో అమెరికాకు స్పష్టంగా తెలుసు అని చెప్పారు.

జై శంకర్ అమెరికాలో ఉన్నారు. 2+2 హై లెవల్ డిస్కషన్స్ చేస్తున్నారు. అమెరికాలో ఉక్రెయిన్ అంశం గురించి చర్చించామని చెప్పారు. ఎనర్జీ క్రైసిస్, ఫుడ్ సెక్యూరిటీ, హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ గురించి మాట్లాడామని చెప్పారు. శాంతియుతంగా చర్చల ద్వారానే అన్నీ సమస్యలకు ముగింపు పలుకుతాయని చెప్పారు. ఇప్పటికే మార్చి నెలలో 90 టన్నుల వరకు సాయం చేశామని.. మందులు కూడా సరఫరా చేశామని తెలిపారు.
వచ్చే క్వాడ్ సమ్మిట్ వరకు ఇండి ఫసిపిక్ రీజియన్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొనాలని అనుకుంటున్నామని తెలిపారు. మీడియాతో అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications