చైనాతో కీలక చర్చలు: ఐదు సూత్రాల అమలుకు రెండు దేశాల అంగీకారం: ఎంఈఏ వెల్లడి

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరికలు చేసుకుంటున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) విషయంలో భారత్ అంగీకరించని 1959నాటి ఒప్పందం ప్రకారం భూభాగాలు తమవేనన్న చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చడం, లదాక్ ను కేంద్ర పాలిత గుర్తించబోమన్న డ్రాగన్ ప్రకటనపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా..

భారత్-చైనా మధ్య బుధవారం దౌత్యపరమైన చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని ఇరు పక్షాలు సమీక్షించాయి. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు తెర దించడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు రష్యాలో జరిపిన చర్చల్లో రూపొందించిన ఐదు సూత్రాలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు జరిగాయి.

India, China agree to implement Jaishankar-Wang 5-point plan, says MEA

చైనాతో చర్చలకు సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితిని రెండు దేశాలు సమీక్షించాయని, ఆగస్టు 20న వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై సవివరంగా చర్చించినట్లు పేర్కొంది. ఇరు దేశాల రక్షణ మంత్రులు జరిపిన చర్చల్లో రూపొందించిన 5 పాయింట్లపై ప్రధాన దృష్టితో తాజా చర్చలు జరిగినట్లు పేర్కొంది.

సైనిక చర్చల్ని ఇకపైనా కొనసాగించాలని దౌత్య చర్చల్లో రెండు దేశాలు భావిస్తున్నాయని, సరిహద్దులో వివాదాల పరిష్కారం కోసం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి తదుపరి (7వ రౌండ్) చర్చలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించినట్లు ఎంఈఏ తెలిపింది. సైనికాధికారుల గత సమావేశంలో.. సరిహద్దువైపునకు కొత్తగా బలగాలను తరలించకూడదన్న అంగీకారం కుదరగా, పూర్తిగా దళాల ఉపసంహరణ జరిగేందుకు సైతం కృషి చేయాలని నిర్ణయించినట్లు ఎంఈఏ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+