వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా విషయంలో ఆచితూచి అడుగేస్తున్న ప్రధాని మోడీ ... నేడు సాయంత్రం అఖిలపక్షం ఆంతర్యం ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా సరిహద్దు లో చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా గ్యాల్వన్ వ్యాలీలో భారత సైన్యం 20 మంది మృతి చెందిన నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. చైనా విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న నరేంద్రమోడీ చైనా అంశమే ప్రధాన అజెండాగా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్న నేపధ్యంలో ఆసక్తి నెలకొంది .

బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ .. సోషల్ మీడియా ఉద్యమం బానే ఉన్నా .. రియాల్టీ ఇదే !!బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ .. సోషల్ మీడియా ఉద్యమం బానే ఉన్నా .. రియాల్టీ ఇదే !!

నేడు చైనా విషయంలో ఆల్ పార్టీ మీటింగ్

నేడు చైనా విషయంలో ఆల్ పార్టీ మీటింగ్

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ చైనా విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. సరైన సమయంలో మన సత్తా, శక్తి, సామర్థ్యాలు చాటి చెబుదామని, మన హక్కులు కాపాడుకునే విషయంలో రాజీ పడేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తాము శాంతిని కోరుకుంటున్నామని,అలా కాదంటే ధీటుగానే బదులు ఇస్తామంటూ పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ . నేడు ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా చైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

మోడీ ఆల్ పార్టీ మీటింగ్ లో అభిప్రాయాల సేకరణ వెనుక ఆంతర్యం

మోడీ ఆల్ పార్టీ మీటింగ్ లో అభిప్రాయాల సేకరణ వెనుక ఆంతర్యం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను పాల్గొనమని ఆహ్వానించినట్లుగా సమాచారం.సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని, చైనా అంశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఒక పక్క దేశం కరోనాతో సతమతమౌతున్నవేళ, నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్ తో నెలకొన్న వివాదం, ఇక తాజాగా చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భారత దేశ ఆర్థిక స్థితిగతులు,భారత దేశ రక్షణ వ్యవస్థ సామర్ధ్యం వీటన్నింటిని బేరీజు వేసుకుని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించటం వెనుక ఒక మంచి ఆంతర్యం ఉందని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి.

దేశ క్షేమం దృష్ట్యా తొందరపాటు వద్దనే ఆలోచనలో మోడీ .. ప్రతిపక్షాల విమర్శలు

దేశ క్షేమం దృష్ట్యా తొందరపాటు వద్దనే ఆలోచనలో మోడీ .. ప్రతిపక్షాల విమర్శలు

దేశం యొక్క తాజా పరిస్థితి అందరికీ విదితమే. చైనాతో యుద్ధం చేయడం అంటే, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినంత ఈజీ కాదు. 20 మంది సైనికులు మృతి చెందిన ఈ సమయంలో తీవ్రమైన వేదన ఉన్నప్పటికీ, సంయమనం కోల్పోయి దేశానికి కలిగే లాభ,నష్టాలను బేరీజు వేయకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశం.ఇక మరో పక్క చైనా విషయంలో మోడీ సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు అని, రోజుకో రకమైన విమర్శలు ,అనుమానాలు ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నపరిస్థితి .

ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహమే ఆల్ పార్టీ మీటింగ్

ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహమే ఆల్ పార్టీ మీటింగ్

ఇక ఈ సమయంలో అఖిలపక్ష భేటీ ద్వారా అందరితో మాట్లాడి వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఉండదని ప్రధాని మోడీ భావిస్తున్నారు. చైనాతో యుద్ధం చేయడమైనా, దౌత్యం చేయడమైనా అంత ఈజీ కాదు. ఇక ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి వారి అందరి అభిప్రాయాలు తీసుకుని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, దేశానికి కలిగే లాభ, నష్టాలను అంచనా వేసి, దేశాన్ని సురక్షితంగా ఉంచే ఒక మార్గాన్ని అన్వేషించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని బీజేపీ వర్గాల అభిప్రాయం.

అన్ని పార్టీల అధ్యక్షులకు ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొనాలని ఆహ్వానం

అన్ని పార్టీల అధ్యక్షులకు ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొనాలని ఆహ్వానం

ఇక నేటి సాయంత్రం జరగనున్న సమావేశంలో బీజేపీ తరఫున జేపీ నడ్డా,కాంగ్రెస్ తరఫున సోనియాగాంధీ,తృణమూల్ కాంగ్రెస్ తరపున మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్,అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి, పన్నీర్ సెల్వం,శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే,టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, వైసిపి చీఫ్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి,ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, సిపిఎం తరపున సీతారాం ఏచూరి, సీపీఐ తరపున రాజా, సమాజ్వాది తరపున అఖిలేష్ యాదవ్,టిఆర్ఎస్ తరఫున కెసిఆర్, ఎల్జెపి తరఫున చిరాగ్ పాశ్వాన్ ,అకాలీదళ్ తరఫున సుఖ్ బీర్ బాదల్ ,జేఎంఎం తరపున హేమంత్ సోరెన్ లు పాల్గొననున్నారు.

Recommended Video

Telangana People Proud of Colonel Santosh Babu : Public Reaction
చైనాకు బుద్ధి చెప్పేందుకు ఎవరేం చెప్తారో అన్న ఆసక్తి

చైనాకు బుద్ధి చెప్పేందుకు ఎవరేం చెప్తారో అన్న ఆసక్తి

ఒకపక్క ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా మూడు రోజులపాటు సైనికాధికారుల స్థాయి చర్చలు జరిగినప్పటికీ, చైనాకు బుద్ధి చెప్పడానికి భారత్ ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేడు సాయంత్రం జరుగనున్న అఖిలపక్ష భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.ప్రస్తుతం దేశ పరిస్థితులను బట్టి వివిధ పార్టీల అధ్యక్షులు చైనా విషయంలో ఏ నిర్ణయం చెప్తారు.. ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక భవిష్యత్తులో చైనా విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షాల నోరు కట్టడి చేసేలా, అదే సమయంలో చైనాకు చెక్ పెట్టేలా చూడాలన్నదే మోడీ అంతరార్థమని,ఆయన మౌనానికి కారణం అదేనని బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది.

English summary
The all-party meeting, called by Prime Minister Narendra Modi to discuss the situation at the border areas with China, is scheduled to be held on today at 5 pm. in the wake of the death of 20 Indian Army personnel in the Galvan Valley on the border with India. Interested debate in the backdrop of the All-Party Meeting being china issue is main agenda, and also strategy to check criticism of opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X