తీరు మార్చుకోని చైనా: సరిహద్దుల్లో అదే హైటెన్షన్: చర్చలకు పిలిచి..అంగీకరించని డ్రాగన్
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు విఫలం అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి దశలవారీగా, సరిహద్దుల్లో వేల సంఖ్యలో మోహరించిన సైనికులను వెనక్కి తీసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య ఏడాదిన్నర కాలంగా దశలవారీగా ఈ కమాండర్ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అవి విఫలమౌతునే ఉన్నాయి.
Recommended Video
Indian Army Statement on the failed talks with Chinese PLA at Moldo yesterday. Indian side made constructive suggestions for resolving the remaining areas but the Chinese side was not agreeable and also could not provide any forward-looking proposals. pic.twitter.com/YjRwAgXfgd
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 11, 2021
ఫలితంగా- వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. పైగా చైనా తన సైనిక బలగాల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. గత ఏడాది వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించడం.. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అనంతరం అదే ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం.. భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీర మరణం పొందడంతో అక్కడి పరిస్థితి మరింత క్లిష్టంగా తయారైంది. ఒకదశలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ పరిస్థితులను నియంత్రించడానికి దశలవారీగా ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు దశలవారీగా కొనసాగుతున్నాయి. ఆదివారం మరో దఫా రెండు దేశాల కమాండర్లు భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా భూభాగంపై ఉన్న ఛుసుల్-మోల్డో బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్‌లో ఈ చర్చలు ఏర్పాటయ్యాయి. అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ కమాండర్ స్థాయి జరగడం ఇది 13వ సారి. ఈ చర్చలు విఫలం అయ్యాయని ఆర్మీ అధికారులు ప్రకటించారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించడానికి తాము చేసిన కొన్ని ప్రతిపాదనలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంగీకరించట్లేదని తెలిపారు. ఒకరి భూభాగంపైకి మరొకరు చొరబడకూడదంటూ ఇదివరకే కుదిరిన ఒప్పందాల లోబడి నడుచుకోవాలంటూ తాము చేసిన ప్రతిపాదనలను చైనా ఆర్మీ కమాండర్ అంగీకరించలేదని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడానికి ముందు నాటి పరిస్థితులను పునరుద్ధరించాల్సి ఉందని, సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి చేసిన సూచనలను పట్టించుకోలేదని అన్నారు.
తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో ఇటీవలే రెండు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య ఏర్పాటైన ద్వైపాక్షికక చర్చలకు అనుగుణంగా లఢక్ తూర్పు ప్రాంతం సహా వాస్తవాధీన రేఖ వెంబడి స్టేటస్ కోను కొనసాగించాల్సి ఉంటుందని చేసిన సూచనల పట్ల చైనా ఆర్మీ కమాండర్ స్థాయి అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. రెండు దేశాలు సమంగా వెనక్కి తగ్గితే.. ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించుకున్నట్టవుతుందని సూచించినప్పటికీ.. చైనా ఆర్మీ అధికారులు అంగీకరించలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications