హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ బీఈ కార్బెవాక్స్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్: ఆ రెండు టీకాలు తీసుకున్నవారికి బూస్టర్ డోస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కోర్బెవాక్స్ కోవిడ్-19 బూస్టర్‌ను హెటెరోలాగస్ కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా ఆమోదించింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు వారి ప్రాధమిక కోవిడ్-19 టీకా (రెండు డోసులు) కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ టీకాలు ఆరు నెలలు ముందు తీసుకున్నవారికి ఇస్తారు.

కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా ఆమోదం

కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా ఆమోదం

కార్బెవాక్స్‌ను తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్, వ్యాక్సిన్ కంపెనీ బయోలాజికల్ ఇ. లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటనలో.. ""బీఈ కార్బెవాక్స్ భారతదేశంలో భిన్నమైన COVID-19 బూస్టర్‌గా ఆమోదించబడిన మొదటి వ్యాక్సిన్.
ఇటీవల, బీఈ తన క్లినికల్ ట్రయల్స్ డేటాను డీసీజీఐకి అందించింది.. డీసీజీఐ సబ్జెక్ట్ నిపుణుల కమిటీతో వివరణాత్మక మూల్యాంకనం, చర్చల తర్వాత ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న వ్యక్తులకు కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఇవ్వడానికి ఆమోదాన్ని మంజూరు చేసింది.

డీసీజీఐ ఆమోదంపై సంతోషం వ్యక్తం చేసిన మహిమా దాట్ల

డీసీజీఐ ఆమోదంపై సంతోషం వ్యక్తం చేసిన మహిమా దాట్ల

బయోలాజికల్ ఇ క్లినికల్ ట్రయల్ డేటా కార్బెవాక్స్ బూస్టర్ మోతాదు రోగనిరోధక ప్రతిస్పందనలో గణనీయమైన మెరుగుదలని, సమర్థవంతమైన బూస్టర్‌కు అవసరమైన అద్భుతమైన భద్రతా ప్రొఫైల్‌ను అందించిందని చూపించిందని ప్రకటనలో పేర్కొంది.
బయోలాజికల్ ఇ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ఈ ఆమోదం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము, ఇది భారతదేశంలో COVID-19 బూస్టర్ డోస్‌ల అవసరాన్ని పరిష్కరిస్తుందన్నారు. మా COVID-19 టీకా ప్రయాణంలో మేము మరో మైలురాయిని అధిగమించాము. ఈ ఆమోదం కార్బెవాక్స్ నిరంతర ప్రపంచ-స్థాయి భద్రతా ప్రమాణాలు, అధిక ఇమ్యునోజెనిసిటీని మరోసారి ప్రతిబింబిస్తుందని మహిమా దాట్ల తెలిపారు.

కోవిన్ యాప్ ద్వారా కార్బెవాక్స్ బుక్ చేసుకోవచ్చు

కోవిన్ యాప్ ద్వారా కార్బెవాక్స్ బుక్ చేసుకోవచ్చు

కాగా, Corbevax టీకా కోసం స్లాట్‌ను Co-WIN యాప్ లేదా Co-WIN పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 51.7 మిలియన్ డోసుల కార్బెవాక్స్ పిల్లలకు అందించబడింది. వీరిలో 17.4 మిలియన్లు రెండు-డోస్ నియమావళిని పూర్తి చేశారు. బీఈ భారత ప్రభుత్వానికి 100 మిలియన్ డోస్ కార్బెవాక్స్ సరఫరా చేసిందని వార్తా సంస్థ నివేదించింది.

English summary
India clears Corbevax as Covid booster shot For 18 Years And Above.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X