Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గిన్నిస్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం బస్తా

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఇండియా గేట్ బాస్మతీ రైస్ బియ్యం బస్తా గిన్నిస్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. 550 కేజీలకు పైగా బరువు కలిగిన ఈ బస్తాలో బియ్యాన్ని నింపడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

భారత్‌కు చెందిన ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతీ రైస్ బస్తా 'గల్-2016'లో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇండియా గేట్ క్లాసిక్ రైస్ బ్రాండ్ వ్యాపారులు 550 కేజీల బాస్మతీ రైస్‌ను పాలిధీన్ బ్యాగులో నింపి ఈ రికార్డు నెలకొల్పారు.

India Gate's 550-kg rice bag enters the Guinness

ఈ బియ్యపు బస్తాను ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు దుబాయ్‌లో జరుగుతున్న 'గల్-2016' ప్రదర్శనలో ఉంచారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకోవడంపై ఇండియా గేట్ బాస్మతీ రైస్ ఎగుమతిదారైన కేఆర్బీఎల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్‌లో ఒకరైన ప్రియాంక మిట్టల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గుల్‌పుడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏదైనా షాపింగ్ మాల్‌లో కానీ, రిటైల్ షాపులో కానీ కొంత కాలం ఉంచుతామని, అనంతరం ఈ బియ్యాన్ని కార్మికులకు పంపిణీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకోవడంతో సర్టిఫికెట్‌ను బహుకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+