మోడీని అడ్డంగా బుక్ చేసిన ట్రంప్? ఆ ప్రెస్ మీట్ పై కేంద్రం క్లారిటీ..!

జూన్ 17న ఫ్రాన్స్ లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) భేటీ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్లో ట్రంప్- మోడీ ఇద్దరూ తాము చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోదామని, మీడియా నుంచి ప్రశ్నలు స్వీకరించవద్దని భారత్ కోరింది. అయితే ముందు ఓకే అన్న ట్రంప్.. ఆ తర్వాత మాత్రం ఆ విషయం మర్చిపోయి మీడియా ప్రశ్నలకు సమాధానాలివ్వడం ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సాగిన ఆ మీడియా సమావేశంలో ప్రధాని మోడీ ఇబ్బందిపడ్డారనే అర్దం వచ్చేలా భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!
కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!

సాధారణంగా ప్రెస్ మీట్లు నిర్వహించని ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ లో జీ7 సదస్సు సందర్బంగా అంతర్జాతీయ మీడియాను కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించారా అన్న చర్చ మొదలైంది. ఆ రోజు ప్రెస్ మీట్ కు ముందు ట్రంప్ తనతో మాట్లాడుతూ..
భారతీయులు ఏ అంశాలను లేవనెత్తబోతున్నారని అడిగారని, వారికి ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగారని గోర్ తెలిపారు. దీనికి స్పందనగా తాను.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒకే ఒక కోరిక ఉంది. అదేమిటంటే, మీడియాను తీసుకురండి, కానీ పూర్తిస్థాయి పత్రికా సమావేశం నిర్వహించవద్దని చెప్పిందన్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రశ్నలు స్వీకరించి, పరోక్షంగా నరేంద్రమోదీని ఇబ్బంది పెట్టారని సెర్గియో గోర్ గుర్తుచేసుకున్నారు.

India Hits Back at Sergio Gor s Modi-Trump No Questions Remark Explains VVIP Protocol
India-US Trade Deal: భారత్-యూఎస్ డీల్ పై గుడ్ న్యూస్..! అమెరికా కీలక ప్రకటన..!
India-US Trade Deal: భారత్-యూఎస్ డీల్ పై గుడ్ న్యూస్..! అమెరికా కీలక ప్రకటన..!

అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్.. ప్రధానమంత్రి ప్రశ్నలు స్వీకరించడానికి ఎందుకు భయపడుతున్నారని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం (India Govt).. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సమావేశానికి సంబంధించి జరిగిన సంభాషణపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన వివరాలను తోసిపుచ్చింది. ఏ వీవీఐపీ పర్యటనకైనా ముందు నాయకులు మీడియాతో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరగడం ఒక సాధారణ ప్రక్రియ అని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పర్యటనలకు సంబంధించి తమకున్న ప్రామాణిక విధానాన్ని తెలియజేసినట్లు క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+