భారత్‌లో వేతనాలు 9.4 శాతం పెరిగే అవకాశం: సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 9.4 శాతం మేర పెరుగనున్నాయని ఓ సర్వే వెల్లడించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జీతాల పెంపు ఉంటుందని తెలిపింది.
పనితీరుపై ఎక్కువ శ్రద్ధ నేపథ్యంలో ప్రతిభావంతులకు అత్యధికంగా 15.4 శాతం ప్రోత్సాహకాలు అందనున్నాయని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఆయాన్ హెవిట్స్ జీతాల పెంపు చేసిన సర్వేలో తెలిపింది.

వెయ్యి కంపెనీలు, ఇరవై పరిశ్రమలపై సర్వే చేసి ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఉద్యోగుల జీతాల పెంపు 9.4 సాతం, నుంచి 9.6 శాతం ఉంటుందని పేర్కొంది.
2017లో ఉద్యోగుల జీతాల పెంపు సగటున 9.3 శాతం ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications